Site icon NTV Telugu

Health Risks : రెగ్యులర్ గా పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా..

Untitled Design (2)

Untitled Design (2)

కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎమినల్‌ను నెమ్మదిగా కరిగిస్తుందంటున్నారు. ఆహారం తీసుకున్న 4–6 గంటల్లోపే దంతాలపై ప్లాక్ అనే జిగట పొర ఏర్పడుతుంది. ఇది 12 గంటల తర్వాత గట్టిపడి టార్టర్ గా మారుతుందని.. దీంతో 24 గంటల తర్వాత చిగుళ్లు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఒక్క రోజు కూడా పళ్లు తోమకపోతే నోటిలో ఒక మిలియన్‌కు పైగా బ్యాక్టీరియా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

నిరంతరం పళ్లు తోమకపోతే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని డెంటిస్ట్ లు చెబుతున్నారు.. ఒక అధ్యయనం ప్రకారం రోజూ పళ్లు తోమని వ్యక్తులకు వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదం సుమారు 25 శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం పాటు పళ్లు సరిగా తోమకపోతే గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చని వారు చెబుతున్నారు.

పొగాకు వాడకపోయనా పళ్లు తోముకోకుండా ఉండే వారికి నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా కొంతవరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. సంవత్సరం పాటు పళ్లు తోమకుండా ఉంటే, దంతాలు తీవ్రమైన కుళ్ళు, కుహరాలు, పుండ్లు, అధిక నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమై, చివరికి పళ్లు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంది.అందుకే డెంటిస్ట్‌లు ప్రతిరోజూ రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యానికే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే డెంటిస్ట్ ని కలిసి సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version