Site icon NTV Telugu

Health Benefits of Guava: జామపండులో ఉన్న పోషక గుణాల గురించి తెలిస్తే.. మీరు అస్సలు వాటిని వదిలి పెట్టరు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఆరోగ్యంపై మనం శ్రద్ధ చూపించలేకపోతున్నాం. అయితే మనకు ఎన్నో రకాల పండ్లను తినడంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిలో జామకాయ కూడా ఒకటి. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్C, ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు.

అయితే..ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్C, ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చలికాలంలో జామకాయలు అధికంగా లభించడంతో తక్కువ ధరకే దొరుకుతాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న జామకాయను రోజుకు కనీసం ఒక్కటైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో జామకాయలు తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయన్నారు. జామకాయల్లో విటమిన్C అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

జామకాయల్లో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి కడుపును శుభ్రపరుస్తుంది. దీంతో విరేచనం సక్రమంగా జరిగి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు లైకోపీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా జామకాయలు ఎంతో ప్రయోజనకరమైనవి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. అదనంగా, జామకాయలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం కావున మీకు ఏదైనా సందేహాలు ఉంటే న్యూట్రిషియన్స్ సంప్రదించండి.

Exit mobile version