Site icon NTV Telugu

Health Benefits of Dry Fruits: డ్రై ప్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడంతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

Untitled Design (5)

Untitled Design (5)

డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు.

బాదం, వాల్‌నట్‌లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణ మెరుగుపడేలా చేస్తాయి.ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కిష్మిస్, ఖర్జూరం, పిస్తాలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

అంజీర, కిస్మిస్ లో ఉన్న ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ప్రూన్స్‌ కూడా జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యకు సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లోని మంచి కొవ్వులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.బాదం, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ తక్కువ పరిమాణంలో తీసుకున్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. తో ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.

ప్రూన్స్‌లో ఫైబర్‌, విటమిన్ K, విటమిన్ A, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రూన్స్‌ ఉపయోగపడతాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు అనేక అధ్యయనాల్లో చెప్పబడినప్పటికీ, మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఏ డ్రై ఫ్రూట్స్‌ను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడానికి ఒకసారి న్యూట్రిషియన్ లేదా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Exit mobile version