డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి…
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ తమ రోజును ప్రారంభిస్తారు. దీంతో ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని భావిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ అలవాటు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే, ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే బదులు, ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని…
ఖర్జూరం సహజమైన తీపి, పోషకాలతో కూడిన పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం అల్పాహారంలో లేదా వ్యాయామం తర్వాత ఖర్జూరం తినడం మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను…