NTV Telugu Site icon

Corn Benefits: శీతాకాలం సూపర్ ఫుడ్.. మొక్కజోన్నతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Corn

Corn

వర్షాకాలంలో బజ్జీలు ఎంత ఫేమస్సో.. శీతాకాలంలో మొక్కజోన్న అంత ఫేమస్. ఈ మొక్కజోన్న‌ను ఇష్టపడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. టేస్ట్ కోసమో, సరదాగా కోసమో కానీ చాలామంది మొక్క జొన్నను తినడానికి ఇష్టపడతారు. అది చాలా మంచి పద్దతి అంటున్నారు. ఎలా తిన్న, ఎప్పుడు తిన్న ఈ మొక్కజోన్న ఆరోగ్యానికి మిన్న అంటున్నారు నిపుణులు. పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Also Read: Rajastan : రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నేడు 3:15గంటలకు మంత్రుల ప్రమాణం

అందుకే ఉడికించిన, కాల్చినా.. ఏవిధంగా తీసుకున్న ఇది ఆరోగ్యానికే మేలే అంటున్నారు నిపుణులు. ఉడికించిన, కాల్చిన, మొక్కజొన్న ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి మేలే అంటున్నారు నిపుణులు. అలాగే ఈ మొక్క జొన్న ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మొక్కజొన్న తింటే తక్షణ శక్తి వస్తుంది. నిత్యం వ్యాయామం చేసేవారు, జిమ్‌లకు వెళ్లేవారు, క్రీడాకారులు తమ ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకుంటారు.

Corn1

మొక్కజొన్నను అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి మొక్కజొన్న తినవచ్చు. మొక్కజొన్నలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అదనపు కేలరీలను తీసుకోకుండా నివారించవచ్చు. అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Also Read: Indian Navy Jobs: ఇండియన్‌ నేవీ 910 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ మొక్కజొన్నలో విటమిన్ సి కూడా ఉంటుందట. ఇది చాలామందికి తెలియదు. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

Corn2

Show comments