Site icon NTV Telugu

Alcohol Health Risks: మందు బాబులకు డెడ్లీ వార్నింగ్..

Alcohol

Alcohol

Alcohol Health Risks: ఈ రోజుల్లో మందు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. నలుగురిలో నేను ఏదో తోపు అని అనిపించుకోవాలని కొందరు తక్కువ టైంలో సీసాలకు, సీసాలు లేపడం చేస్తున్నారు. బాబు ఈ స్టోరీ ముఖ్యంగా మీకోసమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి మందు తాగితే కాలేయమే పోతుందని తెలుసు. అయినా తాగడం ఆపడం లేదు. మందు బాబులు తాగుడికి కాలేయంతో పాటు పేగులు కూడా ఎఫెక్ట్ అవుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం వెల్లడించింది.

READ ALSO: Smartphones: రూ.20 వేల రేంజ్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..? ఈ మొబైల్స్ పై ఓ లుక్కేయండి

హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. తక్కువ టైంలో ఎక్కువగా మందు తీసుకుంటే పేగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడైంది. దీంతో పేగులకు వాపు వస్తుందని, దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉందని తెలిపింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో మెడిసిన్ ప్రొఫెసర్, రీసర్చ్ ప్రధాన రచయిత గ్యోంగీ జాబో మాట్లాడుతూ.. “చాలా కాలంగా తాగడం అలవాటు ఉన్నవాళ్లకు, వారి పేగులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందని తెలుసు. కానీ ఆ మార్పులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ అధ్యయనంలో తక్కువ టైంలో ఎక్కువ తాగడం వల్ల పేగులలో మంట కలిగిస్తుందని, నిజానికి ఇది పేగుల రక్షణ పొరను బలహీనపరుస్తుందని అన్నారు. అలాగే అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ బృందం ఎక్కువ మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను వివరించింది. తక్కువ టైంలో ఎక్కువ మద్యం తాగడం పేగులకు హాని కలిగిస్తుందని తెలిపారు.

తక్కువ టైంలో ఎక్కువ మద్యం తాగడం వల్ల పేగులు ఎలా దెబ్బతింటాయంటే.. పేగు పొరలో కొన్ని రక్షణ కణాలు ఉంటాయి. సాధారణంగా ఈ కణాలు శరీరంలో సూక్ష్మక్రిములతో పోరాడటానికి రిజర్వ్ ఫోర్స్‌లా పని చేస్తాయి. వాటిలో న్యూట్రోఫిల్స్ అని పిలిచే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఈ కణాలను NET అని పిలిచే వల లాంటి నిర్మాణాలను రిలీజ్ చేస్తాయి. ఈ NET లు చిన్న ప్రేగు పైభాగాన్ని దెబ్బతీస్తాయి. దాని గోడను బలహీనపరుస్తాయి. దీనివల్ల పేగు లీకైపోతుంది, విషపదార్థాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. మొత్తంమీద ఈ అధ్యయనం తక్కువ వ్యవధిలో అప్పుడప్పుడు కూడా ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరమని సూచిస్తుంది. ఎందుకంటే ఇది పేగులను బలహీనపరుస్తుంది.. అలాగే పేగుల వాపు, ఇతర సమస్యలకు కారణం అవుతుంది.

READ ALSO: Jacob Martin : ఫుల్లుగా తాగి కారుతో క్రికెటర్ బీభత్సం.. అరెస్ట్ చేసిన పోలీసులు

Exit mobile version