Hangover Relief Tips: హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
- అతిగా మద్యం తాగడం వల్ల హ్యాంగోవర్..
- హ్యాంగోవర్ తగ్గడానికి నీరు, విశ్రాంతి కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hangover Relief Tips: రాత్రి సమయంలో అతిగా మద్యం తాగడం వల్ల ఉదయం తలనొప్పి, నీరసం, నోరు ఎండిపోవడం, వికారం వంటి హ్యాంగోవర్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఈ హ్యాంగోవర్ తగ్గించేందుకు కొన్ని టిప్స్ వాడితే రిలీఫ్ లభిస్తుంది. హ్యాంగోవర్‌కు ప్రధాన కారణం, అతిగా మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. మద్యం తాగిన తర్వాత మన శరీర మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల శరీరంలోని ముఖ్యమైన ఖనిజ లవణాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి ముందుగా తగినంత నీటిని అందించాలి, ఎక్కువగా నీరు తాగడం, ఉప్పు-చక్కెర కలిపిన ద్రావణాలు లేదా తేలికపాటి సూప్ తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన ద్రవాలు, పోషకాలను అందిస్తాయి. వికారంగా ఉన్నప్పటికీ కడుపు ఖాళీగా ఉంచొద్దు. టోస్ట్, బిస్కెట్లు, గంజి వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇది సహాయపడుతుంది. దీని వల్ల తల తిరగడం, నీరసం తగ్గుతుంది.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
హ్యాంగోవర్ నివారించేది తగినంత విశ్రాంతి. మద్యం అతిగా తాగడం వల్ల నిద్ర త్వరగా వచ్చినప్పటికీ, మన శరీరం పూర్తిస్థాయిలో నిద్రపోదు. క్వాలిటీ స్లీప్ దెబ్బతింటుంది. కాబట్టి హ్యాంగోవర్ ఉంటే విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన శక్తిని పొందుతుంది.
కడుపులో మంట లేదా అసౌకర్యంగా అనిపిస్తే సాధారణ యాంటాసిడ్ మందులు ఉపశమనం కలిగిస్తాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు సాధారణ నొప్పి నివారణ మందులు ఉపయోగించవచ్చు. అయితే, వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకోవడం మంచిది. చాలా మంది హ్యాంగోవర్ తగ్గడానికి తర్వాత రోజు కూడా మద్యం సేవిస్తుంటారు, ఇది సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. శరీరంపై మరింత ఒత్తిడి తీసుకువస్తుంది. శరీరం ఆల్కాహాల్ ప్రభావం నుంచి కోలుకోవడానికి 8 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఈ లోపే ఈ టిప్స్ పాటిస్తే ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు