NTV Telugu Site icon

Hair Fall Tips: పెరుగుతో రోజూ ఇలా చేస్తే.. మీ జుట్టు రాలడం వారంలో తగ్గిపోతుంది! ట్రై చేసి చూడండి

Hair Care Tips

Hair Care Tips

Benefits Of Curd For Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ‘జుట్టు రాలడం’ (Hair Fall). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జుట్టు ఊడిపోతుంది. ప్రస్తుత లైఫ్‌ స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా చాలామంది జట్టు పల్చబడటంతో పాటు బట్టతల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నిత్యం ఇంట్లో ఉండే పెరుగుతోనే (Hair Fall Remedies) జుట్టు రాలే సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

పెరుగు మరియు ఉల్లిపాయ:
జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు పెరుగు మరియు ఉల్లిపాయల హెయిర్ మాస్క్‌ను అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపడానికి పనిచేస్తుంది. అదే సమయంలో జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
పెరుగు మరియు ఉల్లిపాయల హెయిర్ మాస్క్‌ను తయారుచేయడానికి ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పెరుగు వేయండి. అందులో 4 చెంచాల ఉల్లిపాయ రసం కలపండి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. 40 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో జుట్టును కడగాలి. తరచుగా ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి విముక్తి పొందవచ్చు.

Also Read:
Weight Loss Tips: బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తే సరిపోదు.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి!
పెరుగు మరియు ఉసిరి పొడి:
జుట్టు రాలడం సమస్యకు చెక్ పెట్టాలంటే.. పెరుగు మరియు ఉసిరి పొడి మాస్క్‌ను అప్లై చేయాలి. ఇందులో ఉండే విటమిన్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్థాయి.
ఈ మాస్క్ కోసం ఒక స్పూన్‌ పెరుగు, ఒక స్పూన్‌ ఉసిరి పొడిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీనివల్ల వెంట్రుకలకు కొత్త జీవం రావడమే కాకుండా.. కుదుళ్లకు బలం చేకూరుతుంది. జుట్టు మళ్లీ పెరుగుతుంది.

పెరుగు మరియు మెంతి గింజలు:
జుట్టు రాలడం సమస్యతో ఇబ్బందిపడుతుంటే.. మీ జుట్టుకు పెరుగు మరియు మెంతి గింజల మాస్క్‌ను అప్లై చేయాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.
పెరుగు మరియు మెంతి గింజల మాస్క్‌ను తయారుచేయడానికి ఒక గిన్నెలో 3 చెంచాల పెరుగు తీసుకోవాలి. దానికి 2 చెంచాల మెంతి పొడిని కలపాలి. ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ఆ ప్యాక్‌ని జుట్టుకు 30 నిమిషాల ఉంచాలి. ఆపై షాంపూతో కడగాలి. పెరుగుతో రోజూ ఇలా చేస్తే మీ జుట్టు రాలడం వారంలో తగ్గిపోతుంది.

Also Read: ODI World Cup 2023: అహ్మదాబాద్‌ పిచ్‌ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా.. పీసీబీపై మండిపడిన షాహిద్ అఫ్రిది!

Show comments