Site icon NTV Telugu

Hair Care Tips:పెరుగుతో ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు దూరం..

Hair Curd

Hair Curd

వాతావరణ కాలుష్యాల వల్ల లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల కానీ జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఆ సమస్యల నుంచి బయట పడటానికి కొందరు మార్కెట్ లో కనిపించిన అన్ని క్రీములను వాడేస్తారు.. అలా వాడటం వల్ల ఉన్న సమస్యలు పోవడం ఏమో గానీ కొత్త సమస్యలు వస్తాయి… అలాంటివారికి గుడ్ న్యూస్ ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.. పెరుగుతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చునో ఇప్పుడు చూద్దాం..

ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లు,మాడు నుంచి కుదుళ్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. పెరుగు తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. శీకాయ జుట్టు రాలటం, చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.. పెరుగు పెట్టుకోవడం వల్ల పేలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

 

Exit mobile version