NTV Telugu Site icon

Hair Care: జుట్టు రాలకుండా వుండాలంటే ఇలా చేయండి

Hair

Hair

సిరులంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవారికైతే అదే అందానిచ్చేది. పొడుగాటి జుట్టు వుందా లేదా పొట్టిగా ఉందా ఇలా కాకుండా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేటి జీవన శైలిలో ఎంతో మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. దానికి అనేక కారణాలు ఉంటాయి. తలస్నానం ఎప్పుడు చేయాలి, చేసిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇప్పుడు మన టాపిక్. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. కాసేపు ఎండలతో మరొ కొద్ది రోజు వానలతో శతమవుతున్న మనకు కురులు తడవడం, ఎండకు పొరిబాడం జరుతోంది. అయితే కొద్ది మంది రాత్రి తలస్నానం చేస్తుంటారు.

జుట్టు ఆరదు సరికదా లేనిపోని సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా వుంటుంది. జలుబు, నిద్రపట్టకపోవడం, తలనొప్పి, చుండ్రుకి దారితీసే పరిస్థితి వస్తుంది. తన స్నానం చేసేప్పుడు జుట్టుని తలని కిందికి వంచి నీరు పోసి ఆ తర్వాత నీటిలో డెల్యూట్ చేసిన షాంపూ వేసి రుద్దుకోవటంతో మంచిది. ఓ 10 సెకన్ల నుంచి 15 వరకూ నిదానంగా రుద్ది ఇలా జుట్టుని మొత్తానికి షాంపూని అప్లై చేసి ఆ తర్వాత నీరు పోయడం వల్ల జుట్టుని బాగా క్లీన్ అవుతుంది. తలస్నానం తర్వాత జుట్టుని మెత్తని టవాల్‌తో అద్డడంతో తడి ఆరిపోతుంది. దాంతో జుట్టు సమస్యలు ఉండదు. తలను ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రయ్యర్స్ వాడడం వల్ల జుట్టు పొడిబారి త్వరగా రాలిపోయే అవకాశం ఎక్కువగా వుంటుంది.

సిరోజాల‌ను సహజంగానే ఆరబెట్టుకోనే ప్ర‌య‌త్నం చేయండి. స్వ‌చ్చ‌మైన గాలి మ‌నిషికి ఎంత అవ‌స‌ర‌మో జుట్టుకు కూడా అంతే అవ‌స‌రం. ఇంకా మీకు వైలుంటే సాంబ్రాణి పొగ వేసి దానికి ఆరబెట్టుకోవడంతో కూడా జుట్టు త్వరగా ఆరుతుంది. ఆరిన జుట్టును చాలామంది దువ్వే విష‌యంలో త‌ప్పులు చేస్తుంటారు. అదేందంటే జ‌ట్టును త‌డిగా ఉన్న‌ప్పుడు దువ్వెన‌తో లాగుతుంటారు. అలా చేయ‌డం వ‌ల్ల‌న జ‌ట్టు వూడిపోతుంది. త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత వెంట్రుక‌లు బ‌ల‌హీనంగా వుంటాయి. జ‌ట్టు ఆరిన త‌ర్వాత దువ్వెనకు వెడల్పాటి పండ్లు ఉండే దువ్వెన‌తో చిక్కు తీసుకోవడంతో చిక్కుప‌డ‌దు, పాడ‌వ్వ‌దు.

జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టుని ముడి , జడ వేయడం, అల్లడం లాంటివి అస్స‌లు చేయ‌కూడదు. ఇలా చేయడంతో జుట్టు రాలే సమస్య పెద్దదయ్యే అవ‌కాశం వుంటుంది. కావున దీనికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టురాల‌దు. వారానికి ఓ సారైనా నూనె రాయడం, మసాజ్ చేయడం, సరైన లైఫ్ స్టైల్ అన్ని కూడా చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతం మ‌వుతుంది.

G-7 Summit: జర్మనీలో ప్రధానికి ఘనస్వాగతం.. జీ-7 సదస్సులో పాల్గొననున్న మోదీ