NTV Telugu Site icon

Gold Health Benefits: బంగారు ఆభరణాలతో అందమే కాదండోయ్ .. ఆరోగ్యం కూడా..

Women Gold

Women Gold

ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని ఆ భాగానికి ఇవ్వబడుతుంది. అక్కడ బంగారం ధరిస్తారు.

ఇక రక్త ప్రసరణ అన్ని భాగాలకు అందేలా చేస్తుంది. బంగారం ధరించడం వల్ల తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. చేతి చూపుడు వేలులో ప్రెజర్ పాయింట్ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. మీరు రింగ్ ధరించినప్పుడు, ఈ ప్రెజర్ పాయింట్‌పై ఒత్తిడి ఉంటుంది.. దాని వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. బంగారంతో చేసిన నగలు మానసిక స్థితిని పెంచడంలో సహాయ పడుతుంది. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల తనను తాను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటాడు..

ఇకపోతే ఈ రోజుల్లో బంగారాన్ని వివిధ సౌందర్య చికిత్సలలో ఉపయోగిస్తున్నారు. బంగారం వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది… అలాగే బంగారం తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు ఉన్నాయని అంటున్నారు.. అలాగే వెండి ఆభరణాలను కూడా వేసుకోవచ్చు.. ఒంట్లో వేడి తగ్గుతుంది.. ఇక వెయిట్ కూడా లాస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఇది వింటే ఇక ఆడవాళ్ళు ఆగుతారా.. అదండి అసలు మ్యాటర్.. ఇక బంగారాన్ని విచ్చలవిడిగా కొనిసెయ్యండి వేసుకోండి..

Show comments