Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- వెండి విగ్రహాల కోసం నిమ్మరసం, ఉప్పు చిట్కా
- నల్లటి మచ్చలు పోవాలంటే ఇలా చేయండి
- ఇత్తడి, రాగి విగ్రహాలకు బేకింగ్ సోడా పేస్ట్
- పూజా విగ్రహాలను మెరిసేలా చేసే ఈజీ టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Idol Cleaning Tips : భారతీయ సంస్కృతిలో ఇళ్లలో గణేశుడు , లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచుకుని పూజించడం అత్యంత పవిత్రమైన ఆచారం. విఘ్నాలను తొలగించే వినాయకుడు, సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇల్లు ఆనందమయంగా ఉంటుందని భక్తుల నమ్మకం. త్వరలోనే గణేష్ చతుర్థి పండుగ రాబోతుండటంతో ప్రతి ఇంటా సన్నాహాలు, షాపింగ్ జోరందుకున్నాయి. ఈ పండుగ సందర్భంగా పూజా గదిలోని వెండి, ఇత్తడి, రాగి విగ్రహాలను ఇంట్లోనే సులభంగా, కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి విగ్రహాలను శుభ్రపరిచే సులభమైన మార్గాలు
వెండి విగ్రహాలపై పేరుకుపోయిన నల్లటి మలినాలను తొలగించడానికి నిమ్మరసం, ఉప్పు మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, ఆ నీటిలో వెండి విగ్రహాలను అరగంట పాటు నానబెట్టాలి. అనంతరం మెత్తని టూత్‌బ్రష్‌తో సున్నితంగా రుద్ది మామూలు నీటితో కడిగి తడి లేకుండా దూది వస్త్రంతో తుడవాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పు కలిసి లోహానికి నష్టం కలగకుండా మురికిని వదిలిస్తాయి. మరొక పద్ధతిలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టూత్‌పేస్ట్ కలిపి విగ్రహానికి పూసి బ్రష్‌తో మెల్లగా రుద్ది కడిగితే నల్లటి మచ్చలు మాయమై విగ్రహాలు కొత్తవాటిలా మెరుస్తాయి.
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
ఇత్తడి, రాగి విగ్రహాల మెరుపును పునరుద్ధరించే చిట్కాలు
ఇత్తడి, రాగి విగ్రహాల రంగు వెలిసిపోతే బేకింగ్ సోడా , నిమ్మరసం పేస్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని విగ్రహాలకు పూసి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత గుడ్డతో తుడిచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది లోహపు ఆక్సీకరణను తొలగించి పూర్వ మెరుపును ఇస్తుంది. అలాగే వెనిగర్, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని విగ్రహంపై రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మొండి మలినాలు సులభంగా వదిలిపోతాయి. ఇక కేవలం రాగి పూత మాత్రమే ఉన్న విగ్రహాలైతే, సబ్బు నీటిని పూసి సున్నితమైన గుడ్డ లేదా బ్రష్‌తో కడగడం అత్యంత సురక్షితమైన మార్గం. ఈ చిన్న చిన్న ఇంజంటి చిట్కాలను పాటించి మీ ఇంట్లోని పూజా విగ్రహాలను ఈ పండుగకు సరికొత్తగా సిద్ధం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!