NTV Telugu Site icon

Helth Tips : ఒత్తిడిని దూరం చేసే ఆహార పదార్థాలివే..

Stress

Stress

ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి తరంలో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ఈ కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అన్నింటికీ ఆహారమే దిక్కు అన్నట్లుగా మన రోజు వారి ఆహార విధానంలో పలు మార్పులు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఒత్తిడికి చెక్ పెట్టోచ్చని స్పష్టం చేస్తున్నారు.

READ MORE: Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..

ఇప్పటి వరకు ఆహారపు అలవాట్ల శారీరక ఆరోగ్యంపై ఉంటుందని అనుకునేవాళ్లం. కాని మన మానసిక ఆరోగ్యంపై కూడా ఆహారపు అలవాట్ల ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మీరు మీ ఆహారంలో గింజలు , విత్తనాలను కూడా చేర్చుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదం, వాల్‌నట్‌లు వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చు. వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని హరిస్తాయి. రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ , బ్లూబెర్రీస్ వంటి బెర్రీస్ కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆందోళన వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పొటాషియం,మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడో ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించి, శరీరంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గించడానికి మీరు హెర్బల్ “టీ” తీసుకోవచ్చు. బ్లాక్ టీ , లెమన్ టీ, లావెండర్ టీ వంటి హెర్బల్ టీలు తాగడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు భారతీయ వంటశాలలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇలా పైన తెలిపిన పలు ఆహారపు అలవాట్లను మన రోజు వారి జాబితాలో చేర్చుకుంటే ఒత్తిడిని సులభంగా తగ్గించుకోవచ్చని వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు. తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.