NTV Telugu Site icon

Morning Breakfast: రుచి, ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేయండి

Oats

Oats

అందరూ ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు. అయితే.. తినే దానిలో రుచి, శుభ్రంగా లేకపోతే తినడం కష్టంగా ఉంటుంది. అయితే.. బ్రేక్ ఫాస్ట్ చేసేవారికి పోషకాలతో కూడిన ఓట్స్ సూపర్ ఫుడ్. ఈ రోజుల్లో చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో తింటున్నారు. మనకు లభించే ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఓట్స్ ఒకటి. గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా.. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. రక్తపోటును తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

అందుకే ఓట్స్ అల్పాహారం కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఓట్స్ తింటే చాలా సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయం పూట ఓట్స్ స్మూతీని తయారు చేయడం అనేది పోషకాహారాన్ని కలిగి ఉండటానికి చాలా సులభమైన, ఉత్తమమైన మార్గం. స్మూతీస్‌లో చక్కెరను వేయకుండా చేసుకోవాలి. బదులుగా ఖర్జూరం లేదా బెల్లం ఉపయోగించండి. అంతేకాకుండా.. కాలానుగుణ పండ్లు, కూరగాయలను వేసుకోండి. తద్వారా అది మరింత పోషకమైనవిగా మారతాయి. ఓట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం స్మూతీని తయారు చేయడం ద్వారా.. స్మూతీ ఆకృతి మృదువుగా, క్రీమీగా మారుతుంది. ఓట్స్‌ను ఇలా తయారు చేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. ఓట్స్ ను రకరకాలుగా తయారు చేసుకుని తినవచ్చు.. ఇంతకు ఎలాంటి రకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Jammu Kashmir: కుల్గామ్‌లో ఆయుధాలతో సహా ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు..

ఓట్స్ బనానా స్మూతీ:
అరటిపండు, దాల్చిన చెక్క పొడి, టోన్డ్/సోయా లేదా ఏదైనా పాలు, ఓట్స్, డార్క్ చాక్లెట్, వేరుశెనగ వెన్నని కలిపి మిక్స్ పట్టాలి. క్రంచ్ కోసం చోకో చిప్స్ వేసి తాగాలి.

ఆపిల్ ఓట్స్ స్మూతీ:
తరిగిన యాపిల్ ముక్కలు, వేయించిన బాదం, పాలు, ఓట్స్ కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.. ఈ సులభమైన స్మూతీ రెసిపీతో యాపిల్ ఓట్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

ఆపిల్ సిన్నమోన్ ఓట్స్ స్మూతీ:
ఓట్స్, బెల్లం పొడి, వేడినీరు, పాలు, దాల్చిన చెక్క, యాపిల్ ముక్కలను కలిపి తాగితే చాలా ప్రయోజనం కలుగుతుంది. బెల్లం వల్ల ఈ స్మూతీ రుచి భిన్నంగా ఉంటుంది.

చాక్లెట్ ఓట్స్ స్మూతీ:
ఓట్స్‌లో నానబెట్టిన ఖర్జూరం ముక్కలను వేసి.. వేడినీరు, పాలు, కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. చోకో చిప్స్ వేసి తాగడమే..

స్ట్రాబెర్రీ ఓట్స్ చియా స్మూతీ:
రాత్రిపూట ఓట్స్‌లో పాలు, నానబెట్టిన చియా గింజలు, స్ట్రాబెర్రీలను వేసి కలిపి తాగండి. ఈ స్మూతీని రాత్రంతా రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తాగవచ్చు.

Show comments