భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీన్ని అతిగా వినియోగిస్తే కొంతమందికి అజీర్తి, కడుపులో మంట లాంటివి ఎదురవుతుంటాయి. ఈ గరం మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: Aghori Arrested: వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేయడానికి వెళ్తున్న అఘోరి.. అడ్డుకున్న పోలీసులు
ప్రయోజనాలు
జలుబు, దగ్గు:
వర్షాకాలం, చలికాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. ఈ క్రమంలో.. లవంగాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్కలను దంచి గరం మసాలాను తయారు చేసి తింటే ఈ వ్యాధులు వెంటనే నయం అవుతాయి.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి:
వర్షాకాలంలో చాలా మంది నూనె వస్తువులు తినడం వల్ల అవి అరగవు. అలాంటప్పుడు మసాలా తినడం వల్ల క్లియర్ చేస్తుంది. గరం మసాల చేర్చడం వల్ల కడుపు జీర్ణ రసాలు ఎక్కువగా విడుదల అవుతాయి.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి:
దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గరం మసాలా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రణకు అద్భుతంగా పని చేస్తుంది.
నొప్పి, వాపు:
గరం మసాలాలో ఉండే మసాలాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
డయాబెటిక్ రోగి:
గరం మసాలాలో ఉండే జీలకర్ర, దాల్చిన చెక్క మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వారికి యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌గా పని చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్:
గరం మసాలాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
గరం మసాలా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా తీసుకోవద్దు.. ఎక్కువగా మసాలాలు తినడం వల్ల పైల్స్, గుండెల్లో మంట, అసిడిటీ, కడుపులో చికాకు ఏర్పడుతుంది.