chocolate: చాక్లెట్లని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలు బడికి వెళ్ళను అని మారం చేసినప్పుడు పెద్దవాళ్లు ఓ చాక్లెట్లని కొని పిల్లలకి ఇచ్చి స్కూల్ కి పంపుతుంటారు. స్కూల్ పిల్లలు కూడా బ్రేక్ టైంలో చాక్లెట్లని కొనుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, రోజు ఏదైనా కావొచ్చు ఎన్ని స్పెషల్స్ అయినా ఉండొచ్చు. కానీ చాక్లెట్లు లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది చాక్లెట్ ప్రియులకి. అందుకే చాక్లెట్లు కొంటుంటారు. అయితే సాధారణంగా చాక్లెట్ ధర రూపాయి నుండి 1000 లేదా రెండు వేలు వరకు ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన చాక్లెట్లు కూడా ఉన్నాయి. వాటి ధర లక్షల్లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఆ చాక్లెట్లు గురించి ఎప్పుడు తెలుసుకుందాం.
Read also:Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
ప్రపంచంలోకెల్లా ఖరీదైన చాక్లెట్ చాకొపొలాజి. దీని ఖరీదు అరకిలో సుమారు రూ. 2 లక్షలు. దీన్ని నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ తాయారు చేతుంది. ఈ కంపెనీ 1999లో తొలిసారిగా ఈ చాక్లెట్ ని తయారు చేసింది. దీని తయారీలో అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్ ని ఉపయోగిస్తారు. దీన్ని ఆర్డరుమీద మాత్రమే తాయారు చేస్తారు. ఇక రెండో స్థానంలో నోకా వింటేజ్ ఉంది. దీని ధర అక్షరాలా 56 వేల రూపాయలు. ట్రినిడాడ్, ఈక్వెడార్, వెనెజులా, కోట్ డీవార్ నుంచి సేకరించిన కకోవా గింజలతో దీన్ని తయారు చేస్తారు. మూడో స్థానం డెలాఫీది. దీని ధర రూ. 33 వేలు రూపాయలు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతో దీన్ని తయారు చేస్తారు. ఇక చాక్లెట్ బార్ విషయానికి వస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పా మొదటిస్థానంలో ఉంది. దీని ఖరీదు రూ. లక్షా ఆరువేలు.