Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katte Pongali Recipe: ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చే నైవేద్యం ‘కట్టె పొంగలి’. దేవాలయాల్లో ఇచ్చే ఆ ప్రసాదం తింటుంటే వచ్చే కమ్మని అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అయితే అదే రుచిని మనం ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రాదు అని చాలామంది అనుకుంటారు. కానీ గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి రుచి రావాలన్నా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోవాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఈ స్టోరీలో ఆ చిన్న చిన్న చిట్కాలను తెలుసుకుందాం.
సీక్రెట్ చిట్కా ..
సాధారణంగా పొంగలి అంటే బియ్యం, పప్పు కలిపి ఉడికిస్తారు. కానీ ఈ రెసిపీలో ఒక చిన్న మార్పు ఉంది. కడిగిన బియ్యం, పప్పును నేరుగా ఉడికించకుండా.. వెన్నలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల పొంగలికి కమ్మని వాసనతో పాటు అద్భుతమైన టేస్ట్ కూడా వస్తుంది. ముందుగా పెసరపప్పును పచ్చి వాసన పోయేలా దోరగా వేయించాలి. ఇది పొంగలికి మంచి ఫ్లేవర్‌ను ఇస్తుంది. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పప్పుకు ఆరు కప్పుల నీళ్లు పోయడం వల్ల పొంగలి ముద్దగా కాకుండా, సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోయేలా వస్తుంది. కట్టె పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచి. నెయ్యిలో మిరియాలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా కొంచెం ఇంగువ చేర్చడం వల్ల గుడి ప్రసాదం లాంటి వాసన వస్తుంది. ఈ వేడి వేడి కట్టె పొంగలిని పల్లి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. పండుగలకు నైవేద్యంగా పెట్టడానికైనా లేదా క్విక్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా మీ ఇంట్లో ఈ పద్ధతిలో కట్టె పొంగలిని ఒకసారి ట్రై చేయండి.
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!