Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budda Parakalu Pulusu: తెలంగాణ పల్లె వంటకాల్లో చేపల పులుసుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా చెరువులో తాజాగా పట్టిన బుడ్డ పరకలతో చేసే పులుసు రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ కర్రీని చేపలు విరిగిపోకుండా, నీసు వాసన రాకుండా సరైన పద్ధతిలో వండడం చాలా ముఖ్యం. తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసును ఇలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా బుడ్డ పరకలను శుభ్రం చేసుకోవాలి. చిన్న కత్తెరతో ఈకలు, తోకలు తొలగించి, తలకాయలు తీసేయాలి. అనంతరం చేపల పొట్టను శుభ్రంగా తీసి, ఉప్పుతో రుద్ది కడగాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి నీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలకు ఉండే నీసు వాసన తగ్గుతుంది.
అనంతరం శుభ్రం చేసిన చేపలను ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం, పచ్చి ధనియాల పొడి, కారం, జీలకర్ర – మెంతుల పొడి వేసుకోవాలి. ముందుగా కాల్చుకున్న రెండు ఉల్లిగడ్డలను మెత్తగా ముద్ద చేసి ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం చేపలకు మసాలా బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ముందుగా నానబెట్టుకున్న చింతపండుతో రసం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి వేయించాలి. అనంతరం పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మసాలా పట్టించిన బుడ్డ పరకలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. పకోడీలు వేయించినట్లు చేపలను ఒకేసారి ముద్దగా వేయకూడదు. చిన్న మంటపై ఉంచి గిన్నెకు మూత పెట్టాలి. ఈ కర్రీ చేసేటప్పుడు ముఖ్యంగా చేపలను గరిటెతో కలపకూడదు. అలా చేస్తే చేపలు విరిగి కూరంతా ముద్దగా మారే అవకాశం ఉంటుంది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
చేపలు విరగకుండా ఉండేందుకు గిన్నెను రెండు చేతులతో పట్టుకుని నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేపలు కిందికి, పైకి కదులుతాయి. అనంతరం సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని మొత్తం పోసి చిన్న మంటపై ఉడికించాలి. కూరలో ఉప్పు, కారం, పులుపు సరిపోతున్నాయో చూసుకుని అవసరమైతే సర్దుబాటు చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. పులుసు బాగా మరిగి చిక్కగా మారే వరకు చిన్న మంటపైనే ఉంచాలి. చివరగా దించే ముందు మసాలా పొడి వేసి మరోసారి మరిగిస్తే రుచికరమైన బుడ్డ పరకల పులుసు రెడీ అవుతుంది. పులుసు చిక్కగా మారి పైకి నూనె తేలినప్పుడు కూర సిద్ధం అయినట్టే. అన్నంలో కలుపుకుని తింటే ఈ తెలంగాణ స్టైల్ బుడ్డ పరకల పులుసు రుచి అదిరిపోతుంది. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!