Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drumstick Curry Recipe: మునక్కాయ వీటినే మునగకాయ అని కూడా పిలుస్తారు.. మునగ చెట్టు నుండి వచ్చే పోషకాలు అధికంగా ఉండే కాయ ఇది.. విటమిన్ సీ, ఐరన్, కాల్షియం ఇలా ఎన్నో పుష్కలంగా ఈ కాయలో ఉంటాయి.. అంతేకాదు, మునగకాయతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా మునగకాయతో సాంబార్ లేదా సాధారణ కూర చేస్తుంటారు. అయితే శనగపిండి, పెరుగుతో చేసే ప్రత్యేకమైన మునగకాయ కూరను చాలా మంది రుచి చూసి ఉండరు. ఈ కూరలో శనగపిండి ఇచ్చే చిక్కదనం, పెరుగు ఇచ్చే తేలికపాటి పులుపు కలిసి అద్భుతమైన రుచిని అందిస్తాయి.
మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి కొత్త రుచిని ఆస్వాదించాలని అనుకునేవారికి ఈ మునగకాయ కూర మంచి ఎంపిక.. ఇంట్లో ఉన్న పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ వంటకం అన్నం, రోటీ రెండింటికీ అద్భుతంగా సరిపోతుందనే చెప్పుకోవాలి.. అంతేకాదు.. మునగకాయతో రెగ్యులర్‌గా చేసే రొటీన్ కర్రీల కంటే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది..
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
కావలసిన పదార్థాలు
* మునగకాయలు – 500 గ్రాములు
* శనగపిండి – 4 టీస్పూన్లు
* పెరుగు – 2 టీస్పూన్లు
* తురిమిన వెల్లుల్లి – 1 టీస్పూన్
* కారం పొడి – 1 టీస్పూన్
* పసుపు – 1/2 టీస్పూన్
* ధనియాల పొడి, జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు
* గరం మసాలా – 1/2 టీస్పూన్
* నూనె – 4 టీస్పూన్లు
* టమాటాలు – 2
* ఆవాలు – 1 టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
* కరివేపాకు – 5 నుంచి 7 ఆకులు
* ఉప్పు – తగినంత
* నీరు – అవసరమైనంత
* కొత్తిమీర – అలంకరణ కోసం
తయారీ విధానం
ముందుగా మునగకాయలను శుభ్రంగా కడిగి మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కట్ చేయాలి.. తర్వాత చిన్న కుక్కర్లో మునగకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు, తగినంత నీరు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరువాత కుక్కర్ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి కొద్దిగా నీరు కలిపి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. మరో గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా కారం, పసుపు వేసి నీటితో పల్చటి మిశ్రమంలా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలపడం ముఖ్యం. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె వేరుపడే వరకు బాగా వేయించాలి. తరువాత ఉడికించిన మునగకాయ ముక్కలు వేసి మెల్లగా కలపాలి. కొద్దిగా వేడి నీరు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని మెల్లగా పోస్తూ కలపాలి. శనగపిండి వేసిన తరువాత ఎక్కువగా కలపకుండా మధ్యస్థ మంటపై 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా పెరుగు వేసి బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. అంతే.. కారంగా, రుచిగా ఉండే శనగపిండి-పెరుగు మునగకాయ కూర సిద్ధం. వేడి అన్నం లేదా రోటీతో వడ్డిస్తే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ అడిగి తింటారు.. ఓ సారి ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!