Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sorakaya Uttappam Recipe: సొరకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే సొరకాయ కూర తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే అదే సొరకాయతో కరకరలాడే, మెత్తటి మరియు రుచికరమైన ఉత్తప్పం చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయను ఈ విధంగా అల్పాహారంగా తయారు చేస్తే కుటుంబ సభ్యులందరికీ కొత్త రుచిని పరిచయం చేసినట్టే.
వేసవి కాలంలో మార్కెట్లో విరివిగా లభించే సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ సాధారణ కూరగా వండితే చాలామందికి నచ్చదు. అలాంటి వారికోసమే ఈ ప్రత్యేకమైన ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ. ఇందులో సొరకాయ ఉందని తినేవారికి కూడా తెలియకుండా రుచిగా తయారవుతుంది. ఈ ఉత్తప్పం తయారీలో నానబెట్టిన బియ్యం, ఉడికించిన బంగాళాదుంపలు, తురిమిన సొరకాయను ఉపయోగిస్తారు. దీంతో ఉత్తప్పం చాలా మెత్తగా, బయట నుంచి కరకరలాడేలా వస్తుంది. ఉదయం అల్పాహారంగా మాత్రమే కాకుండా పిల్లల లంచ్ బాక్స్‌కు కూడా ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
కావలసిన పదార్థాలు:
* 1 చిన్న సొరకాయ
* 1 ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
* 2 పచ్చిమిర్చి
* 1 ఉడికించిన బంగాళాదుంప
* 1 కప్పు బియ్యం (1 గంట నానబెట్టినవి)
* 1 అంగుళం అల్లం
* 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
* కొద్దిగా కొత్తిమీర
* 1/2 టీస్పూన్ ఫ్రూట్ సాల్ట్ లేదా బేకింగ్ సోడా
* తగినంత ఉప్పు
* అవసరమైనంత నెయ్యి
తాలింపు కోసం:
* 1 టేబుల్ స్పూన్ నూనె
* 1 టీస్పూన్ ఆవాలు
* 1/2 టీస్పూన్ జీలకర్ర
* 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు
* కరివేపాకు
* 1 టీస్పూన్ ఎర్ర మిరప రేకులు
తయారీ విధానం:
ముందుగా సొరకాయ తొక్క తీసి తురమాలి. దానికి కొద్దిగా ఉప్పు వేసి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా ఉంచడం వల్ల అందులోని అదనపు నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ నీటిని మెల్లగా పిండాలి. కానీ ఆ నీటిని పారేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, ఉడికించిన బంగాళాదుంప, అల్లం, పచ్చిమిర్చి మరియు సొరకాయ నీటిని వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తురిమిన సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నల్ల మిరియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, ఎర్ర మిరప రేకులు వేసి తాలింపు తయారు చేయాలి. ఈ తాలింపును పిండిలో కలపాలి. చివరగా ఫ్రూట్ సాల్ట్ లేదా బేకింగ్ సోడా వేసి మెల్లగా కలపాలి. వేడి పెనంపై కొద్దిగా నెయ్యి రాసి పిండిని ఉత్తప్పంలా గుండ్రంగా పరచాలి. తక్కువ నుంచి మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే.. మెత్తటి, కరకరలాడే సొరకాయ ఉత్తప్పం సిద్ధం. ఈ ఉత్తప్పాన్ని పచ్చి చట్నీ, టమాటా సాస్ లేదా పెరుగుతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఈ అల్పాహారం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. అంటే, రెగ్యులర్‌గా ఒకే తరహా టిఫిన్స్ చేసేవారికి ఇది బెస్ట్ ఎంపికగా చెప్పవచ్చు.. ఇక, వేసవి కూడా కావడంతో.. ఇది ఎంతో మేలు చేస్తుంది..
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!