Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Mango Sharbat Recipe Summer Special Telugu

Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!

Published Date :May 9, 2026 , 9:33 pm
By Gogikar Sai Krishna
  • వేసవికి బెస్ట్ కూలింగ్ డ్రింక్ మామిడి షర్బత్
  • ఇంట్లోనే ఈజీగా తయారు చేసే సమ్మర్ స్పెషల్
  • సబ్జా గింజలు, కుంకుమపువ్వుతో అదిరే రుచి
  • పార్టీలు, డెజర్ట్‌కు పర్ఫెక్ట్ మ్యాంగో డ్రింక్
Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Mango Sharbat : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది తియ్యని మామిడి పండ్లు. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందడానికి, మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎంతో అవసరం. అటువంటి వాటిలో ‘మామిడి పండ్ల షర్బత్’ ఒకటి. కేవలం పానీయంగానే కాకుండా, డెజర్ట్‌లా కూడా దీనిని ఆస్వాదించవచ్చు. దీని తయారీ విధానం చాలా సులభం.

కావలసిన పదార్థాలు:

Also Read

  • Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
  • Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..
  • Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
  • Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్‌గా కరకరలాడే వడలు
Add as a preferred
source on google
  • మామిడి పండు ముక్కలు: 1 కప్పు (బ్లెండ్ చేయడానికి), అర కప్పు (చిన్న ముక్కలుగా కోసినవి)
  • పాలు: సుమారు 2 నుండి 3 కప్పులు (చిక్కనివి)
  • సబ్జా గింజలు: 1 టీస్పూన్ (నానబెట్టినవి)
  • కండెన్స్‌డ్ మిల్క్: 200 గ్రాములు (తీపి కోసం)
  • కుంకుమపువ్వు: కొన్ని రేకులు (గోరువెచ్చని నీటిలో నానబెట్టినవి)
  • ఐస్ క్యూబ్స్: తగినన్ని
  • గార్నిషింగ్ కోసం: దానిమ్మ గింజలు, పిస్తా ముక్కలు, బాదం ముక్కలు

తయారీ విధానం:

1. ప్రాథమిక ఏర్పాట్లు:
ముందుగా ఒక టీస్పూన్ సబ్జా గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని కుంకుమపువ్వు రేకులను గోరువెచ్చని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. మామిడి పండ్ల మిశ్రమం:
ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు మామిడి పండు ముక్కలు , సుమారు ఒకటిన్నర కప్పుల పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి.

3. షర్బత్ తయారీ:
బ్లెండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మిగిలిన పాలను కూడా పోసి కలపాలి. తీపి కోసం 200 గ్రాముల కండెన్స్‌డ్ మిల్క్ వేయాలి. ఒకవేళ కండెన్స్‌డ్ మిల్క్ లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు, కానీ కండెన్స్‌డ్ మిల్క్ మంచి రుచిని ఇస్తుంది.

4. ఫ్లేవర్ , కూలింగ్:
ఇందులో ముందుగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు నీటిని, కొన్ని ఐస్ క్యూబ్స్ , నానబెట్టిన సబ్జా గింజలను వేసి బాగా కలపాలి.

5. ఫైనల్ టచ్:
షర్బత్ రుచిని మరింత పెంచడానికి అందులో చిన్నగా కోసిన మామిడి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన బాదం , పిస్తా ముక్కలను వేసి నెమ్మదిగా కలపాలి.

అంతే..! ఎంతో రుచికరమైన, రిఫ్రెషింగ్ మామిడి పండ్ల షర్బత్ సిద్ధం. దీనిని గ్లాసుల్లోకి తీసుకుని చల్లచల్లగా సర్వ్ చేయండి. ఎండలో బయట నుండి వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కూడా దీనిని డెజర్ట్‌లా అందించవచ్చు. మామిడి పండ్ల సీజన్ ముగిసేలోపు మీరు కూడా ఈ రుచిని తప్పక ప్రయత్నించండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Healthy Drinks
  • Homemade Sharbat
  • Mango Recipes
  • Mango Sharbat
  • Summer Drinks

తాజావార్తలు

  • Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!

  • Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ

  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..

  • TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions