Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
కావలసిన పదార్థాలు:
* ఎండు మిరపకాయలు (గుంటూరు మిర్చి): 50 గ్రాములు
* ధనియాలు: 30 గ్రాములు
* జీలకర్ర: 1 టీస్పూన్
* మెంతులు: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో సహా): పావు కప్పు
* పసుపు: అర టీస్పూన్
* ఇంగువ: పావు టీస్పూన్
* కల్లుప్పు (లేదా సాల్ట్): రుచికి సరిపడా
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను శుభ్రంగా తుడిచి, మధ్యలోకి తుంపుకోవాలి. ఇలా తుంపడం వల్ల వేయించేటప్పుడు గింజలు లోపల వరకు చక్కగా వేగి కమ్మని రుచి వస్తుంది. తర్వాత స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలను వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు వేయించాలి. అవి కాస్త వేగాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టౌ ఆపేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన మిర్చి, ధనియాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా పావు కప్పు వెల్లుల్లి రెబ్బలను (పొట్టుతో సహా) వేసి మిక్సీని పల్స్ మోడ్‌లో ఒకసారి తిప్పాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకుండా కారప్పొడిలో కలిసిపోయేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట రెండు నెలల వరకు, ఫ్రిజ్‌లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
దోశ మీద ఈ కారప్పొడిని చల్లి, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందంటే నమ్మకండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మటి కారంపొడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.
READ ALSO: Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!