దక్షిణ భారతీయ అల్పాహారాల్లో దోశ తర్వాత అంతటి ప్రజాదరణ పొందింది ఉతప్పం. సాధారణ దోశ కంటే కాస్త లావుగా ఉండే ఈ వంటకం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే చాలామందికి ఇంట్లో చేస్తే హోటల్‌లో లాగా మెత్తగా, ఎర్రగా రావడం లేదనే ఫిర్యాదు ఉంటుంది. కేవలం పిండి కలిపే విధానంలోనూ, కాల్చే పద్ధతిలోనూ కొన్ని మార్పులు చేస్తే అచ్చం రెస్టారెంట్ రుచితో ఉతప్పంను సిద్ధం చేసుకోవచ్చు.
MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలు..
పిండి తయారీలో రహస్యం:
ఉతప్పం రుచిగా రావాలంటే పిండిని కనీసం 8 నుండి 10 గంటల పాటు పులియబెట్టాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, ఇడ్లీ పిండి కంటే కాస్త పల్చగా, దోశ పిండి కంటే గట్టిగా ఉండాలి. రెస్టారెంట్లలో ఉతప్పం సాఫ్ట్‌గా రావడానికి పిండిలో కొద్దిగా ఉడికించిన అన్నం లేదా అటుకులను కలిపి రుబ్బుతారు. ఇది ఉతప్పంకు మంచి రంగును, మెత్తదనాన్ని ఇస్తుంది.
వేసే విధానం , టాపింగ్స్:
పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె రాసి, ఒక పెద్ద గరిటెడు పిండిని వేయాలి. దీనిని దోశలా పల్చగా రుద్దకూడదు, కేవలం కాస్త వెడల్పు చేస్తే సరిపోతుంది. ఉతప్పం వేసిన వెంటనే దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర , అల్లం ముక్కలను చల్లాలి. హోటల్ స్టైల్ రుచి కావాలంటే పైన కొద్దిగా ‘కారప్పొడి’ చల్లితే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ముక్కలు విడిపోకుండా ఉండాలంటే గరిటెతో వాటిని పిండిలోకి కొద్దిగా నొక్కాలి.
Telangana: తెలంగాణలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సప్లైపై కీలక అప్‌డేట్..
కాల్చే పద్ధతి:
ఉతప్పంను ఎప్పుడూ మధ్యస్థ మంట (Medium Flame) మీదనే కాల్చాలి. హై ఫ్లేమ్ మీద పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. చుట్టూ కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి వేడివేడిగా అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే రెస్టారెంట్ వెళ్ళిన అనుభూతి కలుగుతుంది.
