How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ, ఖరీదైన వెన్నతో ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇంట్లోనే సులభంగా స్వచ్ఛమైన వెన్నను తయారు చేసుకోవచ్చు. గంటల తరబడి మీగడను కవ్వంతో చిలకడం లేదా మిక్సీ వేసే పని లేకుండా, అచ్చం మన అమ్మమ్మల కాలం నాటి సులభమైన పద్ధతిలో కమ్మనైన వెన్నను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతిలో వెన్నతో పాటు రుచికరమైన మజ్జిగ కూడా తయారవుతుంది.
కావాల్సిన పదార్థాలు:
పది నుంచి పన్నెండు రోజులుగా ఫ్రిజ్‌లో సేకరించి ఉంచుకున్న పాల మీగడ
ఒకటి లేదా రెండు కప్పుల చల్లటి ఐస్ వాటర్
చిటికెడు ఉప్పు (ఉప్పు వెన్న కావాలనుకుంటే మాత్రమే)
Also Read
- Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
తయారీ విధానం:
మొదటగా పాలు కాగాక తేలిన మీగడను రోజూ సేకరించి ఫ్రిజ్‌లో లేదా ఫ్రీజర్‌లో భద్రపరచుకోవాలి. వెన్న తయారు చేయడానికి కనీసం రెండు గంటల ముందు మీగడను బయటికి తీసి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో ఈ మీగడను తీసుకుని, విస్కర్, మవ్వం లేదా గరిటె సహాయంతో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఒకే దిశలో నిరంతరం కలపాలి. కొద్దిసేపటికి మీగడ చిక్కబడి, దాని రూపం మారడం గమనించవచ్చు. ఆ తర్వాత అందులో ఒకటి లేదా రెండు కప్పుల చల్లటి ఐస్ వాటర్ పోయాలి. ఇలా చల్లటి నీరు వేయడం వల్ల వెన్న వెంటనే పైకి తేలుతుంది. నీరు లేదా మజ్జిగ కిందకు చేరుకుంటాయి. ఇప్పుడు పైకి తేలిన వెన్న మొత్తాన్ని చేతులతో లేదా గరిటెతో వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ వెన్నను మరో ఒకటి రెండు సార్లు చల్లటి నీటితో కడిగితే అందులో ఉన్న పాలు పూర్తిగా పోతాయి. ఎలాంటి రసాయనాలు లేని, పూర్తి స్వచ్ఛమైన కమ్మనైన ఇంటి వెన్న తయారైపోయినట్లే! దీన్ని ఒక గాలిచొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఒకటి నుంచి రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. ఇక అడుగున మిగిలిన నీరు అచ్చమైన మజ్జిగలా ఉంటుంది.
తాజావార్తలు
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
-
Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!