Ragi Banana Bread Recipe: జీరో మైదా, నో ఎగ్.. షుగర్ లేకుండా రాగి పిండితో ఇంట్లోనే సాఫ్ట్ బ్రెడ్ రెడీ!

Ragi Bread

Ragi Bread

Eggless Ragi Banana Bread Recipe: పొద్దున్నె లేచిన వెంటనే తమ కుటుంబీకులకు హెల్తీ, టేస్టీ టిఫిన్ చేయాలని చాలా మంది తల్లులు తహ తహ లాడుతుంటారు. సమయం తక్కువగా ఉండటంతో చాలా కంగారు పడుతుంటారు. సమయా భావం వల్ల ఉదయాన్నే తొందరగా లేస్తూ ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్లు రాగితో అద్భుతమైన టిఫిన్ రెసిపీని తీసుకొచ్చాం. చేయడం చాలా సులువు. టేస్టీగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం హోటల్‌లో బఫే బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తే ఒక ప్రత్యేకమైన వాసన మనసును లాగేస్తుంది. వేడిగా, మెత్తగా, తీయగా ఉండే బనానా బ్రెడ్‌ చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. ఒక కప్పు వేడి టీతో బ్రేడ్ నంచుకు తింటే.. ఆహా ఆ రుచి మరచిపోలేం. వాస్తవానికి.. ఈ బ్రెడ్‌లో ఆరోగ్యానికి మంచివే కానీ… మైదా వాడొద్దు. మైదాకి బదులుగా గోధుమపిండి, రాగిపిండి వాడితే రుచి మాత్రమే కాదు పోషకాలు కూడా పెరుగుతాయి. అందుకే ఇప్పుడు ఎగ్ లేకుండా కేవలం రాగితో బెడ్ బ్రెడ్ తయారు చేద్దాం..

READ MORE: Old Clothes Health Risks: పాత దుస్తులనే మళ్లీ మళ్లీ వాడుతున్నారా..? అవి మార్చకపోతే ఇంత ప్రమాదమా..?

అవసరమైన పదార్థాలు..
గోధుమపిండి – 1 కప్పు
రాగిపిండి – అర కప్పు
పాలపొడి – అర కప్పు
బాగా పండిన పెద్ద అరటిపండ్లు – 3 (లేదా చిన్నవైతే 4)
వాసనలేని నూనె – అర కప్పు
తేనె – 2/3 కప్పు
బేకింగ్‌ పౌడర్ – అర టీస్పూన్
బేకింగ్‌ సోడా – 1 టీస్పూన్
దాల్చిన చెక్క పొడి – 1 టీస్పూన్
జాజికాయ పొడి – అర టీస్పూన్
ఉప్పు – చిటికెడు
బాదం, అక్రోట్‌ పొడి – అర కప్పు

తయారీ విధానం..
ముందుగా గోధుమపిండి, రాగిపిండి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు అన్నీ కలిపి జల్లెడ పట్టాలి. ఇలా చేస్తే బ్రెడ్‌ చాలా మెత్తగా వస్తుంది. అరటిపండ్లను బాగా మెత్తగా మెదిపి, అందులో తేనె, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత పాలపొడి కలిపి మిశ్రమం ముద్దలా అయ్యేలా చేయాలి. ఇప్పుడు పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెల్లగా కలపాలి. ఎక్కువగా కలపకూడదు. చివరగా డ్రై ఫ్రూట్స్‌ పొడి వేసి మెల్లగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా నూనె రాసిన బ్రెడ్‌ టిన్‌లో వేసి, ఓవెన్‌లో 180° సెల్సియస్‌ వద్ద సుమారు ఒక గంట బేక్‌ చేయాలి. టూత్‌పిక్‌ పెట్టి చూడాలి. బయటకు తీయగానే టూత్ పిక్ శుభ్రంగా ఉంటే బ్రెడ్‌ రెడీ అన్నమాట. కొద్దిసేపు చల్లారిన తర్వాత ముక్కలు కోసుకుంటే.. లోపల మెత్తగా, బయట కొద్దిగా గోధుమరంగులో మెరిసే హెల్తీ బనానా బ్రెడ్‌ రెడీ..!