NTV Telugu Site icon

Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి

Garlic

Garlic

వెల్లుల్లి ఒక సహజ ఔషధం. వెల్లుల్లిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో రుచి కోసం వాడుతారు. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల రుచితో పాటు వాసనను తగ్గిస్తుంది. వెల్లుల్లిని ఊరగాయలు, చట్నీలకు కూడా ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద, ఔషధ గుణాలకు శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే.. వెల్లుల్లితో జలుబు, దగ్గు తగ్గించవచ్చు. అధిక బీపీ ఉన్నవారు రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే.. వారి బీపీని సులువుగా నార్మల్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో కాకుండా.. నెయ్యిలో కాల్చుకుని తింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యిలో కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Read Also: CM Chandrababu: నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే గౌట్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. గ్యాస్, అసిడిటీ , అజీర్ణం వంటివి నివారిస్తుంది. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి గుండె ధమనులను శుభ్రంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.

కీళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే కీళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి. వెల్లుల్లి, నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను నియంత్రిస్తాయి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిలాగే నెయ్యి కూడా మంటను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌కు నెయ్యి, వెల్లుల్లి కలయిక దివ్యౌషధం.

శక్తి స్థాయిలు మెరుగుపడతాయి:
వెల్లుల్లి, నెయ్యి కలయిక శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. నెయ్యి ఒక అద్భుతమైన శక్తి వనరు.. వెల్లుల్లితో కలిపి తినడం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల బలహీనత, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.

Show comments