Site icon NTV Telugu

Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

Curd Upma Recipe

Curd Upma Recipe

Curd Upma Recipe: మండే వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్దామంటే భయమేస్తోంది. భానుడి భగ భగలకు చేమటలు పట్టేస్తున్నాయి. ఈ టైమ్‌లో బయట ఎలాంటి ఫుడ్ తినాలన్నా భయమేస్తుంది. అందుకే ఇంట్లోనే బెస్ట్ ఫుడ్స్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గురించి చూద్దాం.. శీతాకాలంలో రోజంతా ఎంతోకొంత తింటూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఎండలు పెరిగే కొద్దీ మన కడుపు తేలికైన, చలువ చేసే ఆహారాన్ని కోరుకుంటుంది. ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటూ శరీరానికి శక్తిని, మనసుకి హాయిని ఇచ్చే అద్భుతమైన అల్పాహారం పెరుగు ఉప్మా. ఉప్మా అంటే సాధారణంగా చాలా మందికి నచ్చదు. కానీ.. ఈ పెరుగు ఉప్మాను ఒక్కసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ కావాలంటారు. పిల్లలకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.

READ MORE: Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

కావలసిన పదార్థాలు:
సూజీ (ఉప్మా రవ్వ): 2 కప్పులు
పెరుగు: 1 కప్పు
నీళ్లు: 4 కప్పులు
తాలింపు దినుసులు: 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ శనగపప్పు
కరివేపాకు: 10-12 రెమ్మలు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
కూరగాయలు: ½ కప్పు (క్యారెట్, బఠానీలు వంటివి మీ ఇష్టానుసారం)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 2 (నిలువుగా చీల్చినవి)
మసాలాలు: రుచికి సరిపడా ఉప్పు, కారం
అలంకరణకు: కొత్తిమీర

తయారీ విధానం:

ముందుగా ఒక బాణలిలో ఉప్మా రవ్వను తీసుకుని, మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. పప్పులు వేగి చిటపటలాడుతున్నప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక, మీరు తీసుకున్న కూరగాయ ముక్కలను వేసి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కూరగాయలు ఉడికిన తర్వాత, ఒక కప్పు పెరుగు వేసి ఒక నిమిషం పాటు కలపాలి. ఆపై 4 కప్పుల నీటిని పోసి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఉండలు కట్టకుండా మెల్లగా పోస్తూ కలుపుతూ ఉండాలి. రవ్వ నీటిని పీల్చుకుని దగ్గరపడే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని వేడివేడిగా వడ్డించండి.

 

Exit mobile version