Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengali Aloo Posto Recipe: ప్రతి వంట గదిలో ఉల్లి, టమోటా, ఆలూ తప్పకుండా ఉంటాయనే చెప్పాలి.. బంగాళదుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది బంగాళదుంపలను మసాలాలు, ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి కూరగా వండుకుంటారు. అయితే ప్రతిరోజూ ఒకే రకమైన ఆలూ కూర తిని విసుగొచ్చిందా? అయితే ఈసారి బెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ వంటకం ఆలూ పోస్తోను ప్రయత్నించండి. గసగసాలు, పచ్చిమిర్చి, ఇతర మసాలాలతో తయారుచేసే ఈ కూర ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. తయారుచేయడం కూడా చాలా సులభం. వేడి వేడి అన్నం, రోటీ లేదా పరాఠాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆలూ పోస్తో తయారీకి కావాల్సిన పదార్థాలు
– బంగాళదుంపలు – 3 నుంచి 4 (మధ్యస్థ పరిమాణంలో)
– గసగసాలు – 3 టేబుల్ స్పూన్లు
– పచ్చిమిర్చి – 3
– జీలకర్ర – 1 టీస్పూన్
– పసుపు – 1 టీస్పూన్
– ఎండు మిరపకాయలు – 3
– ఉప్పు – రుచికి సరిపడా
– కొత్తిమీర – కొద్దిగా
– నూనె – తగినంత
Also Read
- Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
- Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
ఆలూ పోస్తో తయారుచేసే విధానం
ముందుగా ఒక బాణలిలో గసగసాలు వేసి సుమారు ఒక నిమిషం పాటు తేలికగా వేయించుకోవాలి. అనంతరం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించిన గసగసాల్లో పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ మరీ పల్చగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత బంగాళదుంపల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి బంగాళదుంప ముక్కలను వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం వాటిని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో బాణలిలో సుమారు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, పసుపు, ఎండు మిరపకాయలు వేసి తేలికగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గసగసాల పేస్ట్, తగినంత ఉప్పు వేసి సుమారు రెండు నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి. అవసరమైనంత కొద్దిగా నీళ్లు పోసి బాణలిపై మూత పెట్టాలి. తక్కువ మంటపై 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించాలి. బంగాళదుంపలు పూర్తిగా ఉడికి, గసగసాల మసాలా బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరిస్తే బెంగాలీ స్టైల్లో ఎంతో రుచికరమైన ఆలూ పోస్తో సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నం, రోటీ లేదా పరాఠాతో ఈ కూరను వడ్డించుకోవచ్చు. ఎప్పుడూ చేసే బంగాళదుంప కూరకు భిన్నంగా కొత్త రుచి కోరుకునేవారికి ఈ ఆలూ పోస్తో మంచి ఎంపిక.
తాజావార్తలు
-
Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
-
OTR: వనపర్తి కాంగ్రెస్‌లో అంతులేని పొలిటికల్ వార్..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..
-
OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
ట్రెండింగ్
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!