NTV Telugu Site icon

Broccoli Benefits: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఇది తినండి

Untitled 8

Untitled 8

health: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం అందరికి తెలుసు. అందుకే అధిక బరువుని నియంత్రణలో ఉంచుకోవడానికి అనేక ప్రత్నాలు చేస్తుంటారు. కొందరు తినడం మానేస్తారు. ఇలా ఆహరం తీసుకోకుండా మానేయడం వల్ల బరువు తగ్గకపోగా అధిక బరువు పెరుగుతారు. దీనికి కారణం శరీరంలో నీరు చేరుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే మనం చేసే డైట్ అనేది హెల్తీగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారం లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ప్రెటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా మానేయడం కూడా ఆరోగ్యానికి మంచి కాదు. మనం తీసుకునే ఆహారంలో బ్రోకలీ ఉండేలా చూసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

Read also:Home Remedies : ఇలా చేస్తే మీ ఇంట్లో బల్లులు మాయం..

అంతే కాదు ఈ బ్రోకలీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రోకలీని నిత్య జీవితం లో భాగం చేసుకున్నట్లైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాన్సర్ ధరి చేరకుండా ఉంటుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. చర్మం, జుట్టు ఆరోగ్యకరంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు, సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలానే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక గుండె సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా బ్రోకలీ దోహదపడుతుంది

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.