మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అదే విధంగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో బార్లీ నీటిని ట్రై చేస్తే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. బార్లీకి సమ్మర్ ప్రాబ్లమ్స్‌ని తప్పించే శక్తి వుందంటే నమ్ముతారా?
మంచి ఎండలోంచి వచ్చి బార్లీ వాటర్ తాగితే కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు. బార్లీ గింజల్ని పొడిగా చేసి ఆ పొడిని నీటిలో వేసి కాసేపు ఉడక నివ్వాలి. అనంతరం ఆ నీటి వడకట్టి ఒక గ్లాసులో పోయాలి. ఇలా చేయడం వల్ల బార్లీ గింజల్లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి అందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగాలి. రోజు ఉదయాన్నే పరగడుపున ఈ బార్లీ వాటర్ తాగితే చాలు.. అదే విధంగా, బయటికి వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కూడా ఈ డ్రింక్‌ని హ్యాపీగా తాగేయవచ్చు.
ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. బార్లీ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. బార్లీ వాటర్ వల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగవుతుంది. ఎండలో బయటకు వెళ్లేవారు ముందుగా కొంచెం బార్లీ వాటర్ తాగి వెళ్లండి. అప్పుడు ఎండ వల్ల కలిగే సమస్యలు మీ దరిచేరవు. వడదెబ్బ తగలకుండా ఉంటుంది.. అనారోగ్యం కలగకుండా ఉండాలంటే ఈ నీటిని తాగుతూ వుండాలి. దీని వల్ల అలసట, నీరసం కూడా దూరం అవుతాయి.
బార్లీ నీటిని తాగడం వల్ల బాడీలోని వేడి బయటకి పోతుంది. దీంతో శరీరం చల్లగా, తేలికగా మారుతుంది. అంతేకాకుండా వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. మూత్ర సమస్యలతో బాధపడేవారికి ఇది ఓ చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. బార్లీ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. విరేచనాలు అయినవారు ఈ నీటిని తాగడం వల్ల సమస్య తగ్గుతుంది, కాళ్ళ వాపులు వచ్చేవారు బార్లీ వాటర్ తాగితే అవి తగ్గుతాయి.
Narayana: నారాయణ కుమార్తెల ముందస్తు బెయిల్ పిటిషన్