NTV Telugu Site icon

Health: జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క దానితో సెట్..!

Cold

Cold

మారుతున్న వాతావరణంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్. ఈ వైరస్ బారిన పడడం వల్ల తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, శరీరం బలహీనపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది. మారుతున్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో లిక్కోరైస్ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని రుచి చక్కెరలా తియ్యగా ఉంటుంది. దీనిని మిఠాయి, పాల ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా.. పొగాకు పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు.

లిక్కోరైస్‌లో సుక్రోజ్, స్టార్చ్, ప్రొటీన్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్లు ఉంటాయి. దీనిని.. జలుబు, దగ్గు ఉన్నప్పుడు కషాయంగా చేసుకుని సేవిస్తే.. గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. జ్వరాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. లిక్కోరైస్ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు ఎలా నయం అవుతాయి.. దాని కషాయాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. లిక్కోరైస్‌ అనేది ఆయుర్వేద లక్షణాలతో కూడిన మూలిక. దీనిని అనేక వ్యాధుల చికిత్సకు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని అనేక వ్యాధులకు చికిత్స కోసం వాడవచ్చు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో లిక్కోరైస్ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లిక్కోరైస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు మంటను నియంత్రిస్తాయి. దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ముగిసిన సీఐడీ విచారణ

లిక్కోరైస్‌ తీసుకోవడం వల్ల శ్లేష్మం పలచబడి గొంతు, ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు వస్తుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న లిక్కోరైస్‌.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గొంతు సమస్య ఉన్నట్లయితే లిక్కోరైస్ డికాక్షన్ తీసుకుంటే.. అది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాపును అదుపులో ఉంచుతుంది.

లిక్కోరైస్‌ డికాక్షన్ తయారు చేసే విధానం:
కావలసినవి:

1-2 టీస్పూన్లు లైకోరైస్ పౌడర్
2 కప్పుల నీరు
1-2 టీస్పూన్లు తేనె
అల్లం

పద్ధతి:
కషాయాన్ని తయారు చేయడానికి మొదట నీటిని మరిగించాలి.
వేడినీటిలో లిక్కోరైస్‌ పౌడర్, అల్లం వేయాలి.
ఈ నీటిని మళ్లీ 10-15 నిమిషాలు మరగబెట్టాలి.
15 నిమిషాల తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె కలుపుకుని తాగాలి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఈ కషాయాన్ని రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగవచ్చు.