NTV Telugu Site icon

Bread: బ్రెడ్ కి ఫంగస్ పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా చేయండి

Bread 0

Bread 0

ప్రస్తుతం మనం బతుకుతున్నది ఆధునిక యుగంలో… అన్ని పనులు త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తుంటాం. ఆహారం విషయంలో కూడా అంతే.. అందుకే ఉదయం అల్పాహారంలో కష్టపడి వండుకునేందుకు బద్ధకంగా మారింది. అప్పటికప్పుడు త్వరగా పూర్తి చేసుకునే మ్యాగీ నూడుల్స్, బ్రెడ్ తో చేసిన వాటికి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా బ్రెడ్ సాండ్‌విచ్ తినేవారి సంఖ్య ఎక్కువ. స్కూల్, కాలేజ్, ఆఫీస్ లకి వీటినే తీసుకెళ్లడానికి ఇష్టపడతారు.

READ MORE: The Deal: హీరోగా మారుతున్న ప్రభాస్ ఫ్రెండ్!!

మార్కెట్ నుంచి బ్రెండ్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తుంటాం. అయితే బ్రెడ్ కొనేటప్పుడు, దానిని ఇంట్లో నిల్వ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా బ్రెడ్ కొనేటప్పుడు దాని ప్యాకెట్ వాలిడిటీని చెక్ చేసుకోవాలి. నిజానికి కానీ మనం బ్రెడ్ ను ఎక్కువ కాలం నిల్వ చేయలేం. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎప్పుడూ తాజాగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఫ్రిజ్‌లో బ్రెడ్ నిల్వ చేయడం ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది.

READ MORE:Central Cabinet Decisions: వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు.. రైతాంగం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

సాధారణంగా, బ్రెడ్ తయారు చేసినప్పుడు, దానిలోని స్టార్చ్ అణువులు నీటిని గ్రహించి గట్టిపడతాయి. దీని కారణంగా బ్రెడ్ మృదువైన , మెత్తటి ఆకృతిని పొందుతుంది. అయితే, మనం బ్రెడ్ చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు, స్టార్చ్ అణువులు తిరిగి స్ఫటికీకరించడం దాని నుంచి నీటిని బయటకు పంపడం ప్రారంభిస్తాయి. ఇది బ్రెడ్ గట్టిపడుతుంది పొడిగా అయిపోతుంది. అలా అని బయట ఉంచితే దానిపై ఫంగస్ చేసి చేరుతుంది. ఇలాంటి బ్రెడ్ తినడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అయితే బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచాలని మీరు భావిస్తే.. గాలి కూడా దూరని బాక్స్ లో లేదా ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అందులో ఉంచడం మంచిది. గాలి పారితే మాత్రం అది గట్టిగా అయిపోతుంది. ఇక బ్రెడ్ రోజుల తరబడి పాడవుకుండా.. మృదువుగా ఉండాలంటే.. దానిని శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచ వచ్చు. ఇలా చేయడం వల్ల దానిపై ప్రమాదకర ఫంగస్ చేరదు. రెండు రోజుల వరకూ అది తాజాగా ఉంటుంది.