Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Walking 10,000 Steps Daily: ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ రోజుకు 10,000 అడుగులు నడవడం ఒక ట్రెండ్‌గా మారింది. చాలా మంది తమ స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ యాప్స్ ఆధారంగా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వైద్య నిపుణులు మాత్రం ఈ ‘మ్యాజిక్ నంబర్’ అందరికీ సరిపోదని హెచ్చరిస్తున్నారు. ఆర్థోపెడిక్ వైద్యుల ప్రకారం, ప్రతి వ్యక్తి శారీరక స్థితి, వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు అందరూ ఒకే విధంగా 10,000 అడుగులు నడవాలని అనుకోవడం సరికాదు. ముఖ్యంగా ఇప్పటికే మోకాళ్ల నొప్పి, అధిక బరువు లేదా ఇతర కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా నడవడం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, 10,000 అడుగుల లక్ష్యానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారం లేదని చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక మార్కెటింగ్ వ్యూహంగా ప్రారంభమై, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్ ప్రమాణంగా మారిందని వివరిస్తున్నారు. శరీర సామర్థ్యాన్ని అర్థం చేసుకోకుండా అధికంగా నడవడం వల్ల మోకాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. దీని వల్ల మోకాలి మధ్య ఉన్న మృదులాస్థి (కార్టిలేజ్) క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
నడుస్తున్నప్పుడు మన శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడుతుంది. సరైన షూలు లేకుండా గట్టి నేలపై ఎక్కువ దూరం నడవడం వల్ల ‘ఓవర్‌యూజ్ ఇంజూరీస్’ వచ్చే ప్రమాదం ఉంది. నడిచేటప్పుడు మోకాళ్లలో నొప్పి, వాపు లేదా శబ్దం వినిపిస్తే అది కీళ్లపై ఒత్తిడి పెరిగిన సంకేతంగా భావించాలి. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. లేకపోతే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి కేవలం అడుగులు లెక్కించడం మాత్రమే కాదు, సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. రోజుకు 7,000 నుంచి 8,000 అడుగులు నడవడం చాలామందికి సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కండరాలను బలంగా ఉంచేందుకు శక్తి వ్యాయామాలు కూడా చేయాలి. నడిచేటప్పుడు మంచి కుషన్ ఉన్న షూలు ధరించడం, గట్టి నేలల కంటే గడ్డి లేదా మృదువైన ఉపరితలాలపై నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి, ఆరోగ్యానికి నడక చాలా మంచిదే అయినప్పటికీ, అది మన శరీరానికి సరిపోయే విధంగా ఉండాలి. అజాగ్రత్తగా లక్ష్యాల కోసం శరీరాన్ని ఒత్తిడికి గురి చేయడం కన్నా, సమతుల్యంగా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!