Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuzvendra Chahal Creates History: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించారు.. టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోయి చాలాకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, తన అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డులు సాధిస్తున్నాడు. టీ20 క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చాహల్ నిలిచాడు. 2026-27 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా తరఫున ఆడుతూ తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. బుధవారం ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్లో హర్యానా, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్ అమిత్ సాత్విక్ 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు చాహల్ బౌల్డ్ చేశాడు. దీంతో అతను తన టీ20 కెరీర్లో 400వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్. సాయి కిషోర్, మణిమారన్ సిద్ధార్థ్‌లను కూడా పెవిలియన్‌కు పంపించాడు. మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు చాహల్ ఖాతాలో 396 టీ20 వికెట్లు ఉన్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయడంలో విఫలమైనప్పటికీ, సౌరాష్ట్రపై మూడు వికెట్లు సాధించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగే సమయానికి రికార్డుకు చేరుకోవడానికి అతనికి ఒక్క వికెట్ మాత్రమే అవసరమైంది. ఈ మ్యాచ్‌లో ఆ ఘనతను అందుకున్నాడు. చాహల్ చివరిసారిగా 2023 ఆగస్టులో అమెరికాలోని లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున 80 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. 2016 నుంచి 2023 వరకు సాగిన అతని అంతర్జాతీయ టీ20 కెరీర్లో 25.09 బౌలింగ్ సగటు, 8.19 ఎకానమీ రేటును నమోదు చేశాడు.
Also Read
- Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
- Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అతని వికెట్ల సంఖ్య 402గా ఉంది. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ 366 వికెట్లతో రెండో స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా 354 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. పీయూష్ చావ్లా 329, రవిచంద్రన్ అశ్విన్ 323, అక్షర్ పటేల్ 300 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్‌లోనూ చాహల్‌దే అగ్రస్థానం
ఐపీఎల్ చరిత్రలోనూ యుజ్వేంద్ర చాహల్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 188 మ్యాచ్‌లు ఆడి 233 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ టీ20, ఇంగ్లాండ్ వైటాలిటీ బ్లాస్ట్ సహా ఇతర దేశీయ, అంతర్జాతీయ టీ20 టోర్నీల్లో మరో 71 వికెట్లు సాధించాడు. మొత్తంగా టీమిండియాకు దూరమైనప్పటికీ తన బౌలింగ్ ప్రతిభను నిరూపించుకుంటున్న చాహల్.. ఈ అరుదైన రికార్డుతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అతని ప్రస్తుత ఫామ్‌తో అభిమానుల్లోనూ తిరిగి భారత జట్టులోకి రావాలనే ఆశలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..