Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
- జుట్టుకు మేలు చేసే ఉసిరి, రోజ్మేరీ, విటమిన్ E శక్తి
- హెయిర్ ఫాల్ తగ్గించే నేచురల్ ఇంగ్రిడియెంట్స్ రహస్యం
- ఇంట్లోనే ఈజీగా తయారయ్యే హెయిర్ టానిక్ విధానం
- టానిక్ ఎలా వాడాలి? హెయిర్ గ్రోత్ కోసం సరైన పద్ధతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural Hair Tonic : ఈ రోజుల్లో జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ పెంచడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మన పెద్దల కాలం నాటి జానపద చిట్కాలు, నాచురల్ పద్ధతులు దీనికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే కొన్ని ఇంగ్రిడియెంట్స్‌తో జుట్టును ఒత్తుగా, బలంగా మార్చే ఒక మ్యాజికల్ హెయిర్ టానిక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
హెయిర్ టానిక్కు కావలసిన పవర్ఫుల్ ఇంగ్రిడియెంట్స్
ఈ హెయిర్ టానిక్ తయారీకి ముఖ్యంగా మూడు పదార్థాలు అవసరమవుతాయి. మొదటిది ఉసిరి (Gooseberry). ఉసిరి కేవలం హెల్త్‌కే కాదు, హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచి, హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు చిన్న వయసులోనే తెల్లబడకుండా కాపాడుతుంది.
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
- Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ 'పండు మిరపకాయ పచ్చడి'.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
- Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్‌తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!
రెండవది రోజ్మేరీ (Rosemary). జుట్టు ఎదుగుదలకు రోజ్మేరీ చేసే మేలు అంతా ఇంతా కాదు. దీని ఆకులు, కాండాలలో రోస్మరినిక్ యాసిడ్, కార్నోయిక్ యాసిడ్ , కర్పూరం వంటి కొన్ని స్పెషల్ ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు (Hair Follicles) అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందేలా చేస్తాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్‌గా మారి హెయిర్ ఫాల్ వెంటనే తగ్గుతుంది.
ఇక మూడవది విటమిన్ ఇ (Vitamin E). ఇది జుట్టును లోపలి నుండి బలోపేతం చేయడానికి, షాంపూల వాడకం వల్ల డ్యామేజ్ అయిన జుట్టును మళ్లీ హెల్తీగా మార్చడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్‌పై ఉన్న ముడతలను తొలగించి ఫేస్‌ని గ్లోయింగ్‌గా మార్చడంలో కూడా ఇది తోడ్పడుతుంది.
మ్యాజికల్ హెయిర్ టానిక్ తయారీ విధానం
ఈ హోమ్మేడ్ హెయిర్ టానిక్‌ను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో ఉసిరికాయ ముక్కలు (ముఖ్యంగా ఎండబెట్టి నల్లబడిన ఉసిరి అయితే ఇంకా మంచిది), అలాగే కొన్ని రోజ్మేరీ ఆకులను వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తక్కువ మంట మీద (Low Flame) ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ రెండు పదార్థాలలోని పూర్తి పోషకాలు ఆ నీటిలోకి దిగే వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే ఒక ఫిల్టర్ సహాయంతో నీటిని వడకట్టి వేరు చేయాలి. ఆ వేడి నీటిలోనే ఒకటి లేదా రెండు విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్ కట్ చేసి ఆ నూనెను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. దీంతో మీ పవర్ఫుల్ నాచురల్ హెయిర్ టానిక్ రెడీ అయిపోతుంది.
ఎలా వాడాలి?
ఈ టానిక్‌ను ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని భద్రపరుచుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ లిక్విడ్‌ను తలకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత చేతి వేళ్లతో తలపై లైట్‌గా మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోవడమే కాకుండా, ఊడిపోయిన చోట కొత్త జుట్టు వచ్చి హెయిర్ చాలా ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. కెమికల్స్ లేని ఈ సింపుల్ నాచురల్ రెసిపీని మీరూ తప్పకుండా ట్రై చేయండి.
తాజావార్తలు
-
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
-
Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!