ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాలేయంలో పేరుకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు. కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహజ పదార్థాల్లో నిమ్మకాయని ఉపయోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్పులు, సమతుల ఆహారం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ C కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలోని హానికరమైన విషపదార్థాలను బయటకు పంపడంలో, కాలేయ కణాలను చురుకుగా పనిచేసేలా చేయడంలో దోహదపడతాయి.నిత్యం ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం, అలాగే కొద్ది వారాల పాటు ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి వ్యాయామం పాటించడం ద్వారా కాలేయానికి ఉపశమనం లభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు దీన్ని ఫాలో అయ్యేముందు న్యూట్రిషన్ సంప్రదించడం ఉత్తమం.
