NTV Telugu Site icon

Fasting Time Habits: ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి? ఏం తాగాలి?

Fasting Water

Fasting Water

లంఖణం పరమ ఔషధం.. అంటారు. అంటే ఏమీ తినకుండా ఉండడం. ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు. ఒక్కోసారి మనం ఏమీ తినకుండా ఉంటాం. అటువంటప్పుడు నిజానికి ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పైగా ఉపవాసం వల్ల నీరసం వస్తుంది. అలానే దాని వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఉపవాసం చేసినా సరే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిజానికి మనం ఎలా అయినా ఉపవాసం చెయ్యచ్చు. పూర్తిగా ఉపవాసం చేస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.ఒక నిపుణుడి పర్యవేక్షణ లేకుండా సంపూర్ణ ఉపవాసం చేయడమన్నది మంచిదది కాదు.

Read Also: Temperature Dropped: వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోతున ఉష్ణోగ్రతలు

ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఉపవాసం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అనే దాని గురించి అనేక రకాల చర్చలు జరుగుతుంటాయి. ఉపవాసం అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలంటే కొన్ని పద్దతులు పాటించాలి. ఉపవాసం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పిసిఓఎస్, ఒబిసిటీ, కొలెస్ట్రాల్, లివర్ సమస్యలు మొదలైనవి కూడా దరిచేరవు. ఉపవాసం చేసేటప్పుడు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, గోరువెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలిపిన నీరు మాత్రమే తాగాలి.

Read Also: JM Joshi : మాఫియాతో లింకు పెట్టుకున్నందుకు తీసుకెళ్లి పదేళ్ల శిక్ష వేశారు

అయితే ఉపవాసం చేసేటప్పుడు జంక్ ఫుడ్ మాత్రం తినకూడదు. అలానే అనారోగ్యం కలిగించే వాటిని కూడా తీసుకోకూడదు. అదే విధంగా ఉపవాసం సమయంలో ఆరోగ్యానికి హాని చేసే చిప్స్ వంటివి కూడా తీసుకోకూడదు. ఒకవేళ కనుక ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఉపవాసం అనేది అవసరం లేదు. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి కూడా ఇంకా ప్లస్ అవుతుంది.ఉపవాసం మానసిక ఉన్నతికి, తద్వారా చక్కటి ఆరోగ్యం, ఆలో చనా విధానంలో మంచి మార్పునకు అవకాశం కలిగిస్తుంది. ఉపవాసం అనుభవం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తక్కువ సమయం ఉపవాసం చేసినా జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఉత్తేజితమవుతుంది. తద్వారా జీర్ణ కోశం చక్కగా పనిచేస్తుందంటారు వైద్యులు.

ఆహార పదా ర్థాలు బాగా జీర్ణం కావడం వల్ల విషతుల్యమైన మలినాలు ఎక్కువ ఉత్పత్తి కావు. మతపరమైన ఆచార వ్యవహారాలలో, స్వస్థత కోసం అనుసరించే విధానంలో ఉపవాసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉపవాసం చేస్తే శరీరంలో ఉన్న విష తుల్య వ్యర్ధాలు బయటకు వెళ్ళి పోయి మనస్సు, శరీరం హాయిగా ఉంటుంది. ఉపవాసం సమయంలో హెర్బల్‌ టీ తాగడం మంచిదే. కనీసం నెలకు ఒకరోజైనా ఉపవాసం చేయవచ్చు. శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తగినంత మానసిక, శారీరక విశ్రాంతి తీసు కోవాలి. తీవ్రంగా శారీరక వ్యాయామం చేయకూడదు.అయితే నడక, యోగ, స్వల్ప వ్యాయామం చేయడం మంచిదే.. శారీరకంగా, మానసికంగా బాధపడే సమయంలో ఉపవాసం అసలు తగదు. మహిళలు రుతుస్రావం, గర్భినీ సమయంలో, శరీరం బలహీనంగా, అలసటచెంది ఉన్న సమయంలో ఉపవాసం చేయడమనేది ఎంత మాత్రం అభిలషణీయం కాదు.

Read Also: IND Vs SL: నేటి నుంచి వన్డే సిరీస్.. టీమిండియా బోణీ కొట్టేనా?