NTV Telugu Site icon

Health Tips: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..మహిళలకు తప్పనిసరి

Bones

Bones

శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది. మనిషి చురుగ్గా ఉన్నాడంటే.. తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకల బలంగా ఉండాలి. వయసు పైబడిన కొద్దీ ఎముకల్లో బలం తగ్గతూ వస్తుంది. ముఖ్యంగా మహిళలలో ఎముకల అరుగుదళ ఎక్కువగా ఉంటుంది. ఎముక గట్టిగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎముకలు బలహీనపడితే విరిగిపోతాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కింద తెలిపిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినాలి. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు కర్రీలో నువ్వులను వేసుకుని తినొచ్చు. అయితే ఎక్కువగా నువ్వులు తింటే వేడి చేసే అవకాశం ఉంటుంది. సోయాబీన్ లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి మీరు తరచూ సోయాబీన్ ను ఆహారంగా తీసుకోవాలి.

READ MORE: Team India Victory Parade: ముంబై ఎయిర్ పోర్టులో టీమిండియాకు అరుదైన గౌరవం..

ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు తమ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. బచ్చలికూర, ఆవాలు, మెంతులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో పాటు అదనంగా విటమిన్ A, C, Kలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు వాటిని సలాడ్‌లో తినవచ్చు. లేదా వండుకుని తినొచ్చు. పప్పులు, బీన్స్ : పప్పులు, బీన్స్ లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం రెండు మూడు సార్లు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు : పాలు, పెరుగు, జున్ను, మజ్జిగలో కాల్షియం ఉంటుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో కనీసం ఒకటి లేదా రెండు పాల ఉత్పత్తులను చేర్చడానికి ప్రయత్నించండి.