Water Tank Cleaning: ఇక ట్యాంక్ క్లీన్ చేయడం ఈజీ.. వాటర్ ట్యాంకులోకి దిగకుండానే శుభ్రం చేసే సింపుల్ ట్రిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Tank Cleaning: ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ట్యాంకులోకి దిగి మురికి తొలగించడం కష్టమైన పని మాత్రమే కాకుండా, సమయం కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ట్యాంకులోకి దిగకుండానే, నీటిని పూర్తిగా వృథా చేయకుండా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే ఓ సులభమైన చిట్కా మీకు తెలుసా. ఈ చిట్కాను మీ ఇంట్లో వాడటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. అసలు ఆ చిట్కా ఏంటి, దానిని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముందుగా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ పైపు, పొడవైన కర్ర లేదా పైపు, కత్తెర, బ్లేడ్, అడ్హెసివ్ టేప్‌ను తీసుకోండి. తర్వాత ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగాన్ని కట్ చేసి, అక్కడక్కడ చిన్న రంధ్రాలు లేదా గాట్లు పెట్టాలి. అనంతరం బాటిల్ మూత భాగానికి ప్లాస్టిక్ పైపును అమర్చి టేప్‌తో గట్టిగా ఫిక్స్ చేయాలి. బాటిల్‌ను ట్యాంక్ అడుగుభాగం వరకు తీసుకెళ్లేందుకు పొడవైన కర్రను దానికి అమర్చాలి. ఆ తర్వాత పైపులో నీరు నింపి, దాని మరో చివరను ట్యాంక్ కంటే దిగువ భాగంలో ఉంచితే సైఫన్ పద్ధతిలో నీరు బయటకు రావడం ప్రారంభమవుతుంది. బాటిల్‌ను ట్యాంక్ అడుగున ఉన్న మట్టి, ఇసుక, చెత్తపై ఉంచితే అవి నీటితో పాటు పైపు ద్వారా బయటకు వస్తాయి. ఈ పద్ధతిలో ట్యాంకులోకి దిగాల్సిన అవసరం ఉండదు. అలాగే మొత్తం నీటిని ఖాళీ చేయకుండా అడుగున పేరుకుపోయిన మురికిని మాత్రమే తొలగించవచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో తక్కువ ఖర్చుతో వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసుకునే ఈ ట్రిక్ కుదిరితే మీ ఇంట్లో కూడా ప్రయత్నించండి.
Also Read
- Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్‌బై
- Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
- Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
- Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
తాజావార్తలు
-
Water Tank Cleaning: ఇక ట్యాంక్ క్లీన్ చేయడం ఈజీ.. వాటర్ ట్యాంకులోకి దిగకుండానే శుభ్రం చేసే సింపుల్ ట్రిక్!
-
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
-
Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్‌ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
-
YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
-
Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!