NTV Telugu Site icon

Health Tips : ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతున్నారా? ఏం జరుగుతుందంటే?

Fruit Juice

Fruit Juice

ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్‌ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మీ దంతాలకు నష్టం వాటిల్లుతుంది.. పండ్ల ఆమ్లత్వం రసంలో పేరుకుపోతుంది. ఇది ఎనామెల్ అని పిలువబడే దంతాల పై పొరను దెబ్బతీస్తుంది. దీని కారణంగా పళ్ళు సున్నితంగా మారుతాయి..
* పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఫైబర్ ప్రేగులలో ఆహారాన్ని సులభంగా తరలించడంలో సహాయపడుతుంది, దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వంటి సమస్య ఉండదు.. దాంతో మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
* పరగడుపున రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇదీ కాకుండా, పండ్ల రసంలో ఎక్కువ చక్కెర ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది..
* ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి కూడా వేస్తుంది. ఇలా ఉదయం జ్యూస్ లను తాగితే వీటితో పాటుగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.