Site icon NTV Telugu

Hair Care: మీకు జుట్టు రాలుతుందా… వాటివల్లే ఎఫెక్ట్..!

Hair

Hair

మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. జుట్టు బలంగా ఉండాలంటే బాదం, వాల్‌నట్‌లు మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తెలిసో తెలియకో ఈ ఆహారపదార్థాలు తిన్నట్లైతే జుట్టు రాలుతుంది. అయితే అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Coal Levy Case: బొగ్గు లెవీ కుంభకోణంలో ఐఏఎస్ అధికారి రాను సాహు అరెస్ట్

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు
అధిక చక్కెర ఉన్న ఆహారాలు మరియు పానీయాలు తినడం జుట్టుకు మంచిది కాదు. దీని కారణంగా హార్మోన్ల సమతుల్యత క్షీణించి.. జుట్టు పెరుగుదలలో ప్రభావం కనిపిస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారంలో పోషకాలు ఉండవు. వీటిలో కొవ్వు, చక్కెర ఉండే కృత్రిమ పదార్థాలు ఉంటాయి. వీటిని తిన్నట్లైతే అనారోగ్యంబారిన పడుతారు. అయితే మనం తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకాలు లేకపోతే హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి. దీనివల్ల జుట్టు సమస్యలు ఏర్పడుతాయి.

Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్

ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్‌లో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు మరియు సోడియం అధికంగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్‌లో పోషకాలు ఉండవు. దీని కారణంగా జుట్టుపై ప్రభావం పడుతుంది. పొడవాటి మరియు మందపాటి జుట్టు కావాలనుకునే వాళ్లు ఫాస్ట్ ఫుడ్ తినడం మానేస్తే మంచిది.

మద్యం
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా శరీరంలో అవసరమైన పోషకాల లోపం జరుగుతుంది. దీంతో జుట్టు బలంగా మరియు పెరుగుదలలో ప్రభావం పడుతుంది.

కెఫిన్
కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల జుట్టుకు హానికరం. రోజూ కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..

తక్కువ ప్రోటీన్ ఆహారం
జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు చాలా అవసరం. కానీ ప్రొటీన్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు బలహీనపడుతుంది. అందుకే మీ డైట్‌లో ప్రొటీన్లు అధికంగా ఉండే వాటిని తినాలి.

Exit mobile version