NTV Telugu Site icon

Health: టీ తయారు చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..!

Tea

Tea

మన దేశపు ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వార్తలు జనాలను టెన్షన్‌ పెడుతున్నాయి. అయితే.. ఓ స్టడీ ఫలితాల్లో నిజమే అని తేలింది. ఉప్పు, పంచదార కాకుండా.. మన శరీరంలోకి అనేక విధాలుగా మైక్రోప్లాస్టిక్‌లు వెళ్తున్నాయి. దాంతో.. అనేక ప్రధాన వ్యాధులకు గురవుతారు. మనం రోజు తాగే ‘టీ’ తాగడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుంది. అదేలాగో తెలుసుకుందాం..

మైక్రోప్లాస్టిక్ మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. మైక్రోప్లాస్టిక్స్ వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థ సమస్యల నుండి క్యాన్సర్ వరకు అనేక వ్యాధులకు కారణం అవుతుంది. తెలిసో తెలియకో కొన్ని పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్లాస్టిక్‌ని పంపిస్తున్నాం. మనం తాగే టీలో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. చాలా మంది తమ ఇళ్లలో టీని ఫిల్టర్ చేయడానికి ప్లాస్టిక్ స్ట్రైనర్ వాడుతారు. దాని ద్వారా వేడి టీని వడకడుతారు. అంతేకాకుండా.. చాలా మంది ఆఫీసుల్లో పాలీథిన్‌లో టీ ఆర్డర్ చేసుకుని తాగుతారు. అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్లాస్టిక్ వేడిని తాకినప్పుడు.. పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్ విడుదల అవుతుంది. ఈ కారణంగా ప్లాస్టిక్ కవర్లో కూడిన టీ తాగడం హానికరం.

Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!

అలాగే.. రోజూ అందం కోసం ఉపయోగించే వస్తువుల నుండి వాటర్ బాటిళ్ల వరకు అనేక రకాలుగా హానికరమైన ప్లాస్టిక్‌లను మన శరీరంలోకి ప్రవేశపెడుతున్నాము. అయితే.. వీటిని మీరు నివారించాలనుకుంటే వాటిని మీ దగ్గర్లో నుండి తీసివేయడానికి ప్రయత్నించాలి. అనేక టూత్‌పేస్టులు, ఫేషియల్ స్క్రబ్‌లు.. వ్యక్తిగత పరిశుభ్రత వస్తువుల నుండి మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా..?
శాస్త్రవేత్తలు మైక్రోప్లాస్టిక్‌లను మానవజాతి అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తున్నారు. మన శరీరం నుంచి ప్లాస్టిక్‌ని తొలగించడం అంత సులువు కాదు. ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి.. ఆకుపచ్చ కూరగాయలు, వెల్లుల్లి, బ్రోకలీ, క్యాబేజీ, పండ్లు తినాలి. అంతేకాకుండా.. నిమ్మరసం త్రాగి వ్యాయామం చేయాలి. వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోండి.