Site icon NTV Telugu

Diabetes Symptoms: షుగర్ వ్యాధి వచ్చిందని అనుమానమా..? అలా జరిగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..?

Diabetes

Diabetes

Diabetes Symptoms: షుగర్ వ్యాధి.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ప్రధానంగా దీనిని చెప్పవచు. ఈ షుగర్ వ్యాధి ప్రారంభ దశల్లో చాలా మంది వ్యక్తులకు ఈ వ్యాధి ఉందని తెలుసుకోవాదం చాలా ఆలశ్యం అవుతుంది. ఎందుకంటే.. లక్షణాలు కాస్త సున్నితంగా ఉంటాయి. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. వీటిని సమయానికి గమనిస్తే, చికిత్స తీసుకొని మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

ఇక షుగర్ వ్యాధి అనేది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ (రక్తంలోని గ్లూకోజ్) ప్రమాదకరంగా పెరిగే స్థితి. ఇది ప్రధానంగా ఇన్సులిన్ అనే హార్మోన్ సరైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం దాన్ని సరిగా ఉపయోగించలేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో అలసట, బరువు తగ్గడం, ఎక్కువ మూత్రం, దాహం వంటి లక్షణాలు కన్పడతాయి. ఇవి నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశముంది. సమయానికి పరీక్షలు, నివారణ చర్యలు తీసుకుంటే మధుమేహాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు.

Read Also:Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? బయటపడాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

షుగర్ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు:
తరచూ మూత్రవిసర్జన:
బ్లడ్ షుగర్ ఉన్న వ్యక్తులకు తరచూ మూత్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో అనేక మార్లు బాత్రూంకు వెళ్లాల్సి వస్తుంది.

తీవ్రమైన దాహం:
ఈ వ్యాధి వచ్చిన సమయంలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోవడం వల్ల నిరంతర దాహం వేస్తుంది. ఎంత నీళ్లు తాగినా తృప్తిగా అనిపించదు.

అసాధారణ ఆకలిగా ఉండటం:
బ్లడ్ షుగర్ సరైన రీతిలో అదుపు చేయలేకపోవడం వల్ల శరీరం తగిన శక్తిని పొందలేక, ఎక్కువగా ఆకలిగా అయ్యేలా చేస్తుంది.

అలసట:
గ్లూకోజ్ శరీరకణాలకు అందకపోవడం వల్ల శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నిస్సహాయంగా ఉండే భావన కలుగుతుంది.

శరీర బరువు తగ్గడం:
ఇన్సులిన్ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం శరీరంలోని కొవ్వును ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతుంది.

గాయం నెమ్మదిగా మానడం
చిన్న గాయాలు కూడా చాలా కాలం పాటు మానకపోవడం, దీర్ఘకాలం ఉండడం వంటి సమస్యలు షుగర్ వ్యాధికి సంకేతాలు కావచ్చు.

వీటితోపాటు.. కళ్లు మసకబారడం, చూపు తగ్గిపోవడం, చర్మం పొడి బారడం, దురదలు రావడం, అసహనంగా అనిపించడం, లైంగిక సామర్థ్యంలో మార్పులు, మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటి సమ్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.

Read Also:What is Black Magic: బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి..? అసలు చేతబడులు ఉన్నాయా..?

షుగర్ వ్యాధి గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు:
షుగర్ వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని ముఖ్యమైన రక్తపరీక్షలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS), ఇది ఖాళీ కడుపుతో చేసిన పరీక్ష. రెండవది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ (PPBS). ఇది భోజనం చేసిన రెండు గంటల తర్వాత చేసే పరీక్ష. ఈ రెండింటితో పాటు, గత మూడు నెలల బ్లడ్ షుగర్ స్థాయిని అంచనా వేసే HbA1c (గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష కూడా ఉంటుంది. ఇవికాక మరో ముఖ్యమైన పరీక్ష.. గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (OGTT). ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో గెస్టేషనల్ డయాబెటిస్‌ను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. ఈ పరీక్షల ఆధారంగా ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించవచ్చు.

Exit mobile version