Is Dates are Good For Diabetes Patients: ‘ఖర్జూరం’ చాలా రుచికరమైన పండు. ప్రతి సీజన్‌లోనూ ఖర్జూరాలను తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో శరీరం వేడిగా ఉండడం కోసం ఎక్కువగా వీటిని తింటారు. ఖర్జూరాలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తరచుగా వీటిని తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఈరోజుల్లో చాలామంది ఖర్జూరాలను తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఖర్జూరం తీపి పండు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తినవచ్చా? లేదా? అనే సందేహం అందరిలో ఉంటుంది. ఒకవేళ తింటే ఏ పరిమాణంలో తినాలనే గందరగోళం ఉంటుంది. అలాంటి సందేహాలకు పరిష్కారం (Diabetes Health Tips) ఇక్కడ చూద్దాం.
ఖర్జూరాలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్‌కు ఇది ఉత్తమమైన పండు (Dates for Diabetes) అని ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ చెప్పారు. ఖర్జూరంలో పోషకాలకు కొదవలేదు. దీనిలో డైటరీ ఫైబర్ కాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కె, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఖర్జూరంలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర రేటును తగ్గిస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరాలను ఒకటి లేదా రెండు రకాల డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే.. ఎక్కువ సమయం ఆకలి ఉండదు. దాంతో ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అందులకే వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు. డయాబెటిక్ పేషెంట్స్ ఒక రోజులో 2 ఖర్జూరాలను తినవచ్చు. అయితే మీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే.. ఖర్జూరాలను డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తినాలి. ఓట్స్ లేదా క్వినోవాతో కలిపి తింటే పీచు పదార్థాలు ఎక్కువగా అందుతాయి.
ఖర్జూర ప్రయోజనాలు (Dates Benfits):
# ఖర్జూరలో ఉండే మెగ్నీషియం ఎముకలను బలపరుస్తుంది.
# ఖర్జూర తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉండదు.
# అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఖర్జూర తినాలి.
# ఖర్జూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
# బరువు తగ్గించడంలో ఖర్జూర సహాయపడుతుంది.
