Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clean and Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ చక్కగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర పనులతో బిజీగా ఉండే జీవితంలో ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. కొందరి ఇళ్లు మాత్రం ఎప్పుడూ నీట్‌గా కనిపిస్తుంటాయి. వారి రహస్యం ఏంటంటే.. పెద్దగా శ్రమపడకుండా కొన్ని చిన్నచిన్న అలవాట్లను ప్రతిరోజూ పాటించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడానికి రోజువారీ పనులకు ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉండాలి. రోజూ కొద్దిసేపు కేటాయించి కొన్ని పనులు పూర్తి చేస్తే.. ఇంట్లో చెత్త, గందరగోళం పేరుకుపోకుండా ఉంటుంది. మరి ఆ విధానాలేంటో చూసేద్దామా..
వాడిన వస్తువులు:
చాలా మంది చేసే ప్రధాన తప్పు వస్తువులు వాడిన తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం. కాఫీ డబ్బా, తాళాలు, పుస్తకాలు లేదా వంటకు ఉపయోగించిన పదార్థాలు ఏవైనా సరే.. వాటిని వెంటనే వాటి స్థానంలో ఉంచడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వంట చేస్తున్నప్పుడు ఉపయోగించిన వస్తువులను వెంటనే సర్దేస్తే తర్వాత శుభ్రం చేసే పని చాలా తగ్గిపోతుంది.
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ఉదయాన్నే మంచాన్ని సర్దుకోవడం:
ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దుకోవడం చిన్న పని అనిపించినా.. అది గదిని మరింత అందంగా, క్రమబద్ధంగా కనిపించేలా చేస్తుంది. రోజంతా పనులు ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు శుభ్రంగా ఉన్న మంచం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
భోజనం తర్వాత:
వంటగది ఫ్లోర్లే లేదా డైనింగ్ టేబుల్‌పై ఆహారపు మరకలు, చినుకులు పడటం సహజం. అయితే వాటిని వెంటనే తుడిచేస్తే మరకలు గట్టిపడకుండా ఉంటాయి. ప్రతి భోజనం తర్వాత కేవలం కొన్ని నిమిషాలు కేటాయించి కౌంటర్లను శుభ్రం చేస్తే వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది.
వస్తువులను వెంటనే సర్దేయాలి:
పోస్ట్, బిల్లులు, పార్సిళ్లు, కిరాణా సామాన్లు వంటి వస్తువులు ఇంట్లోకి వచ్చిన వెంటనే వాటిని సరిచేయాలి. అవసరం లేని పేపర్లు, జంక్ మెయిల్‌ను వెంటనే తొలగించాలి. మిగిలిన వాటిని వాటి కోసం కేటాయించిన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో అనవసరమైన గందరగోళం తగ్గుతుంది.
బట్టలు ఉతకడం:
వారం చివర్లో బట్టల కొండలా పేరుకుపోయే వరకు వేచి ఉండకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే ప్రతిరోజూ ఒక లోడ్ బట్టలు ఉతికేయడం మంచిది. దీంతో పని భారంగా అనిపించదు.
సింక్‌ను ఖాళీ చేయడం:
వంటగదిలోని సింక్‌లో పాత్రలు పేరుకుపోవడం చాలా మందికి సాధారణ సమస్య. అయితే రాత్రి నిద్రపోయే ముందు పాత్రలను శుభ్రం చేసి సింక్‌ను ఖాళీగా ఉంచితే, మరుసటి రోజు ఉదయం పరిశుభ్రమైన వంటగదితో రోజును ప్రారంభించవచ్చు. ఇది ఇంటి శుభ్రతను కాపాడటంలో కీలకమైన అలవాటు.
* ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే గంటల తరబడి శ్రమించడం కాదు. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కేటాయించి ఈ చిన్న అలవాట్లను పాటిస్తే, ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రత, క్రమబద్ధత కనిపిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!