డాక్టర్లు తరచూ సీజనల్ ఫలాలు తినాలని అంటుంటారు. వానాకాలంలో కమలాలతో పాటు లభించేవి సీతాఫలాలు. ఇవి మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. దీనిలో శరీరంలో వుండే విష వ్యర్థాల్ని బయటకి పంపే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఎంతో మేలు చేసే విటమిన్ సీ విటమిన్ కూడా వుంటుంది. దీంతో పాటుమెగ్నీషియం, పొటాషియం వంటివి మన గుండె ను కాపాడతాయి. అందువల్లే సీతాఫలాలకు అంత డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే ఇప్పుడు పెద్ద సైజ్‌లో సీతాఫలాలు లభిస్తున్నాయి.
బీపీ ని అదుపు చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ మన జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కంటి చూపును కూడా మెరుగు చేసే శక్తిని కలిగి ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు సీతాఫలం తింటే… జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఈ ఫలం లో ఉండే కాపర్,మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపును శుభ్రం చేస్తుంది. దీంతో ఇబ్బంది లేకుండా వుంటుంది. ఏం తిన్నా అరగడం లేదని బాధపడేవారు ఒకసారి సీతాఫలం తిని చూడండి.
అలాగే డయేరియా సమస్యకు చెక్ చెబుతుంది సీతాఫలం. అందులో వుంటే మెగ్నీషియం మన శరీరంలోని నీటి స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కీళ్ల లోని యాసిడ్స్‌ని బయటకు పంపి రుమాటిజం, కీళ్లనొప్పులు రాకుండా చేస్తుంది. అలసిపోయినట్లు ,నీరసంగా అనిపిస్తే వెంటనే సీతాఫలం తింటే ఇందులోని పొటాషియం, కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య తో బాధపడేవారు సీతాఫలం తినాలి. బరువు పెరగాలంటే కూడా సీతాఫలం బాగా పని చేస్తుంది.
ఇందులో ఉండే సహజ చక్కెర, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆస్తమాతో బాధపడేవారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది. ఆస్తమాతో బాధపడేవారు కూడా సీతాఫలం తినవచ్చు. గర్భిణీలు ఖచ్చితంగా తినవలిసిన పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయం లోవచ్చే నొప్పుల్ని నివారించేలక్షణం ఈ పండులో వుంది. ఇందులో వుండే జీర్ణమయ్యే పీచు పదార్థం షుగర్ స్థాయిని అదుపు చేస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఎక్కువ పెరగకుండా రక్షణ ఇస్తుంది. కాబట్టి ఈ కాలం లో దొరికే ఈ ఫలాల్ని తప్పకుండా తినాలి. సీతాఫలం జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.