Coffee: కాఫీ ప్రియులకు నిజంగానే అలర్ట్.. అసలే బయట వాతావరణం చల్లగా ఉంది.. కొంచెం వేడివేడిగా ఒక సిప్ కాఫీ తాగితే ఉంటుంది ఆ మజా.. అంటూ ఒక రోజులో లెక్కకు మించిన కాఫీలు తాగుతున్నారా.. బాస్ తిట్టాడని, ఇంట్లో టెన్షన్స్ అని ఏం తోయడం లేదని అలవాటైన కాఫీని వదలలేక తాగుంటే కొంచెం ఆగండి.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.. పలువురు వైద్య నిపుణులు అసలు కాఫీ తాగితే మంచిదా కాదా అనేది చెప్పారు. ఇంతకీ వాళ్లు కాఫీ గురించి ఏం చెప్పారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Char Dham : చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
ఇలా మాత్రం తాగకండి.. ఓకేనా
వేడి వేడి కాఫీని కొద్దిమంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే, మరికొందరు ఖాళీ కడుపుతో తాగుతుంటారు. మీకు తెలుసా ఉదయం లేవగానే పరిగడుపున కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేడి వేడి కాఫీ మానవ శరీరంపై ప్రతీకుల ప్రభవాన్ని చూపుతుందంటా. ఇలా చేయడంతో పలు ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాఫీలో కెఫెన్ ఉంటుంది తెలుసుకదా.. నిద్రలేచిన వెంటనే కెఫెన్ తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కెఫెన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, నిద్రలేమి, కడుపునొప్పి, వికారం, తలనొప్పి లాంటి సమస్యలు రావొచ్చని Food and Drug Administration పేర్కొంది.
యాసిడ్ రిఫ్లక్స్: ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఇది శరీరంలో అనేక ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనిని ఇలాగే దీర్ఘకాలికంగా చేస్తే అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉంటుదని చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా కాఫీ తాగుతే.. దంతాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
పేగులపై ప్రభావం: ఉదయాన్నే టిఫెన్ లేదా మరే ఇతర ఆహారం తీసుకోకుండా కాఫీ తాగడం వల్ల పేగులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దీంతో కడుపు నొప్పి, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మీరు కూడా ఇలాగే చేస్తే.. మీకు ఆకలి తగ్గిపోవడంతో పాటు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుందని అంటున్నారు.
కాఫీలోని కెఫెన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు తెలిపారు. National Library of medicine అధ్యాయంలో శరీరంలో కార్టిసాల్ స్థాయులు పెరిగితే అధిక బరువు, మొటిమలు, అధిక రక్తపోటు, కండరాల బలహీనతతో పాటు అలసట వంటి సమస్యలు కనిపిస్తాయని వెలుగుచూశాయి. సాధారణంగా కార్టిసాల్ స్థాయి అనేది ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ఈ టైంలో కాఫీ తాగడం వల్ల శరీరంలో జరిగే సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
కాఫీ ఎప్పుడు తాగితే మంచిది అంటే: నిద్రలేచిన తర్వాత 1.5 నుంచి 2 గంటల మధ్యలో కాఫీ తాగడానికి అనువైన సమయం అని నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో కాఫీ తాగడం వల్ల కార్టిసాల్సాధారణ స్థాయికి వస్తుందని తెలుపుతున్నారు. ఒక వేళ మీరు కాఫీని తర్వగా తాగడానికి ఇష్టపడే వారైతే, జీర్ణ సమస్యలను తగ్గించడానికి తేలికపాటి భోజనం లేదా చిరుతిండిని తీసుకోవాలని సూచిస్తున్నారు.