NTV Telugu Site icon

Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..

Coconut (4)

Coconut (4)

కొబ్బరి నీళ్లను వేసవిలో దాహర్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు.. కానీ కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం రైనీ సీజన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. వర్షాకాలం ముగిసే సరికి డెంగ్యూ విజృంభిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన అంశం ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం. ప్లేట్‌లెట్స్ పెంచుకోవడానికి చాలా మంది రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు.. ఎవరు ఏం చెప్పినా దాన్ని నమ్మేస్తారు.. కొన్ని ప్రత్యేకమైన డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి బయటపడవచ్చునని ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది..

అందులో కొబ్బరి నీళ్లు కూడా ఉన్నాయి.. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరుగుతాయని అధ్యయానాల్లో పేర్కొన్నారు.. అంతేకాదు స్ట్రెస్ తగ్గుతుందని, త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారని చెబుతున్నారు.. ముఖ్యంగా బొప్పాయి జ్యూస్ తో పాటుగా బొప్పాయి ఆకుల జ్యూస్ ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. వర్షాకాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వాటి నుంచి బయటపడాలంటే వేడిగా, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది..  ఇక పరిశుభ్రంగా ఉండాలి.. వర్షపు నీటిని చుట్టు పక్కల ఉండకుండా చూసుకోవాలి.. వర్షాలకు బయట తిండి తినడం మానుకోవాలి.. జ్వరాలు ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.