వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMR Shopping: నాణ్యత, విస్తృతమైన కలెక్షన్లు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న CMR షాపింగ్ మాల్, నేడు వనస్థలిపురంలో తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంతో వనస్థలిపురం, పరిసర ప్రాంతాల ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CMR గ్రూప్ ఛైర్మన్ శ్రీ మావూరి వెంకట రమణ గారు, డైరెక్టర్ శ్రీ మావూరి బాలాజీ గారు పాల్గొన్నారు. అలాగే ఎక్స్ MP, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ శ్రీ మధు యాష్కీ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మల్లారెడ్డి రెడ్డి గారు, ఎల్బీ నగర్ బీజేపీ ఇన్ ఛార్జ్ శ్రీ సామ రంగారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ కొప్పుల నరసింహారెడ్డి గారు, ల్యాండ్‌గార్డ్, ఎక్స్ కౌన్సిలర్, యాదగిరిగుట్ట బోర్డు మెంబెర్ పి. ఈశ్వరమ్మ యాదవ్ గారు, షోరూమ్ యజమాని శ్రీ పి. కృష్ణ యాదవ్ గారు, శ్రీ సురేష్ యాదవ్ గారు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ఈ ప్రారంభోత్సవంలో తొలి కొనుగోలుదారుగా శ్రీ పి. కృష్ణ యాదవ్ గారు నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, CMR షాపింగ్ మాల్లోని చీరల కలెక్షన్లు తనకు ఎంతో నచ్చాయని, తాను కూడా క్రమం తప్పకుండా CMRలో షాపింగ్ చేస్తుంటానని తెలిపారు. ఇక్కడ లభించే విభిన్నమైన చీరల డిజైన్లు, కలెక్షన్ల పట్ల తనకున్న అభిరుచిని ఆమె వెల్లడించారు. వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మీనాక్షి చౌదరి, వనస్థలిపురం ప్రజలకు తనపై ఎంతో అభిమానం ఉందని, అదే విధంగా తనకూ ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అనంతరం వేదిక పైనే పాటలకు నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. దీంతో ప్రారంభోత్సవ వేడుక మరింత ఉత్సాహభరితంగా మారింది.
నూతనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్లో లో చీరలు, సంప్రదాయ దుస్తులు, పురుషులు, మహిళలు, చిన్నారుల వస్త్రాలతో పాటు విభిన్నమైన ఫ్యాషన్, లైఫెస్టైల్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారికి, కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట విస్తృతమైన షాపింగ్ సౌకర్యాన్ని అందించేలా మాల్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా CMR షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ మావూరి వెంకట రమణ గారు మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను, ఆకర్షణీయమైన ధరలను అందించడంతో పాటు ప్రతి షాపింగ్‌ను ఒక మధురమైన అనుభూతిగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణతో మరిన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రారంభోత్సవ కానుకగా ప్రింటెడ్ క్రేప్ సారీ కేవలం 89 రూపాయలకే అందిస్తూ మరెన్నో అద్భుతమైన ఆఫర్లను అన్ని కేటగిరీస్ లోను అందిస్తున్నామని తెలియజేశారు. వనస్థలిపురంలో నేటి నుంచి ప్రారంభమైన CMR షాపింగ్ మాల్ స్థానిక ప్రజలకు సరికొత్త షాపింగ్ గమ్యస్థానంగా నిలవనుంది. వనస్థలిపురం, పరిసర ప్రాంతాల ప్రజలందరూ నూతన షోరూమ్‌ను సందర్శించి, విస్తృతమైన కలెక్షన్లను ఆస్వాదించాలని CM R యాజమాన్యం ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?