NTV Telugu Site icon

Clothes Shining Tips: మీ బట్టలు తెల్లగా మెరిసిపోవాలంటే… ఈ పనిచేయండి చాలు

Clothes

Clothes

ఈరోజుల్లో వాషింగ్ మెషీన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో అత్యాధునిక మోడల్స్ కలిగిన వాషింగ్ మెషీన్లు అందుబాటులో వున్నాయి. పాత వాషింగ్ మెషీన్లు మార్చేసి కొత్తవి తీసుకుంటున్నారు. మీరు బట్టలు ఉతికేటప్పడు బట్టలు ఫ్రెష్ గా ఉండాలంటే ఉజాలా, లేదా షైన్ వంటి స్పెషల్ పౌడర్లు వాడడం కామన్. కానీ ఈసారి మీరు ఈ చిట్కా పాటిస్తే మాత్రం అవాక్కవడం ఖాయం. మీ వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికేటప్పుడు కాస్త ఆస్పిరిన్ మాత్రలను వాడితే అద్భుతమైన ఫలితం వుంటుందని చెబుతున్నారు.

వాషింగ్ మెషిన్లలో ఉత్తమమైన లాండ్రీ డిటర్జెంట్లు వాడుతుంటారు. అయితే తెలుపు బట్టలు తెల్లగా వుండాలంటే.. ఆస్పిరిన్ మాత్రలను వాడటం మంచిది. ఇవి మందుల షాపులో దొరుకుతాయి. తెల్లని దుస్తులు.. డల్ గా కాకుండా తెల్లగా, ఫ్రెష్ గా వుండాలంటే.. 323 మిల్లీగ్రాముల ఐదు ఆస్పిరిన్ మాత్రలను ఓ డజను తెల్ల బట్టలను ఉతికేందుకు వాడుతున్నారు.

Read Also: Minister Roja Sattires On Hyper Aadi Live: హైపర్ ఆదిపై మంత్రి రోజా పంచ్ లు

ఆస్పిరిన్ మాత్రలను కరిగించడానికి గిన్నె లేదా వేడి నీటి టబ్ వాడవచ్చు. అన్ని మాత్రలు పూర్తిగా కరిగే వరకు అలాగే ఉంచండి. ఈ మాత్రలు కరిగిన తర్వాత వాషింగ్ మెషీన్ కు ఉపయోగించాలి. ఈ మాత్రలు కరిగిన నీటిని వాషింగ్ మెషీన్ లో వాడితే బట్టలు మెరిసిపోవడం ఖాయం అంటున్నారు. అంతేకాదు తెల్ల బ‌ట్టలను వీలైనంత వ‌ర‌కు వేరే రంగు దుస్తుల‌తో క‌లిపి ఉత‌క‌కూడ‌దని నిపుణులు చెబుతున్నారు. అలా చేయకుండా వివిధ రంగుల దుస్తులు తెల్ల రంగు దుస్తులతో కలిపి ఉతికితే రంగు మ‌ర‌క‌లు తెల్ల బ‌ట్టల‌పై ప‌డే ప్రమాదం ఉంటుంది. దీనివ‌ల్ల తెల్ల బ‌ట్టలు పాడవుతాయి. షేడ్స్ వాటిపై పడతాయి. ఏదైనా మరకలు పడ్డ చోట వెనిగర్ ఉపయోగించి బట్టలు ఉతకాలి. మ‌ర‌క‌లు ఎక్కువ‌గా ఉంటే బ్లీచింగ్‌ను కూడా ఉప‌యోగించ‌వచ్చు. డిట‌ర్జెంట్‌, బ్లీచింగ్ క‌లిపిన నీటిలో తెల్ల బ‌ట్టల‌ను అర‌గంట‌పాటు నానబెట్టాలి. ఆ త‌ర్వాత వేడినీటిలో ఈ బ‌ట్టల‌ను శుభ్రం చేయడం మంచిది.

Read Also:Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.